Entertainment

Samantha: హీరోల కంటే తాను తక్కువ కాదని నిరూపిస్తున్న సమంత.. ట్రెండ్‌ను సెట్‌ చేసిన తొలి హీరోయిన్‌గా..


ఒకప్పుడు సూపర్‌ హిట్‌గా నిలిచి భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్‌ ఇటీవల జోరందుకుంది. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలను స్పెషల్‌ అకేషన్స్‌లో భాగంగా విడుదల చేస్తూ వస్తున్నారు మేకర్స్‌. అభిమానుల నుంచి కూడా సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ…

ఒకప్పుడు సూపర్‌ హిట్‌గా నిలిచి భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్‌ ఇటీవల జోరందుకుంది. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలను స్పెషల్‌ అకేషన్స్‌లో భాగంగా విడుదల చేస్తూ వస్తున్నారు మేకర్స్‌. అభిమానుల నుంచి కూడా సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో మేకర్స్‌ సినిమాలను తిరిగి విడుదల చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇది కేవలం స్టార్‌ హీరోలకు మాత్రమే పరిమితైంది. అయితే తొలిసారి ఓ హీరోయిన్‌ నటించిన చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నారు. ఆ హీరోయిన్‌ మరెవరో కాదు సమంత.

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొరియన్‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఉమెన్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత తన విశ్వరూపాన్ని చూపించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లను కూడా రాబట్టిందీ చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ మూవీని తిరిగి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చిన 8వ తేదీన ఓ బేబీ మూవీని రీరిలీజ్‌ చేస్తున్నారు.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘స్త్రీల నిజమైన అందం, శక్తిని సెలబ్రేట్‌ చేసుకోవడానికి `ఓ బేబీ` ని స్క్రీన్‌లపై చూడటం కంటే మెరుగైన మార్గం మరోటి లేదు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీవీఆర్‌, ఐనాక్స్ స్క్రీన్లలో సినిమా ప్రదర్శించబడుతుంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సినిమాను కేవలం పీవీఆర్‌, ఐనాక్స్‌ స్క్రీన్లలోనే ప్రదర్శించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Advertisement

Related Articles

Back to top button