Entertainment

Samantha: క్రేజీ కాంబో రెడీ.. ఆ యంగ్ హీరోతో జోడి కట్టనున్న సమంత ?..


ఇటీవల ఖుషి చిత్రం నుంచి విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అందమైన ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటి నెలకొంది. ఈ క్రమంలోనే సామ్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆ చిత్రంలో యంగ్ హీరోతో కలిసి నటించనుందట.

ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన శాకుంతలం నిరాశ పరిచింది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో అచి తుచి అడుగులు వేస్తుంది సామ్. ఇప్పుడు ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇటీవల ఖుషి చిత్రం నుంచి విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అందమైన ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటి నెలకొంది. ఈ క్రమంలోనే సామ్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆ చిత్రంలో యంగ్ హీరోతో కలిసి నటించనుందట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ.

డీజే టిల్లు సినిమాతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ హీరో అయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ మూవీతో సిద్ధు క్రేజీ హీరోగా మార్క్ సంపాదించుకున్నాడు. ఇందులో యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ప్రతి ఒక్కరి ఫిదా అయ్యారు. ప్రస్తుతం డీజే టిల్లు సిక్వెల్ లో నటిస్తున్నారు సిద్ధూ. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఇక డీజే టిల్లు సిక్వెల్ కాకుండా.. నిర్మాత రామ్ తళ్లూరి నిర్మించే సినిమాలో నటించనున్నారట. సిద్ధూతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట సదరు ప్రొడ్యూసర్.

ఇక ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. నందిని, సమంత మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఓ బేబీ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా పై అఫీషియల్ అనౌన్స్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button