Entertainment

Samantha: ‘సరిపోయే జోడి కోసం వెతుకుతున్నాను’.. వైరలవుతున్న సమంత ఇన్ స్టా పోస్ట్..


ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే సామ్.. ఇప్పుడు మంచి జోడీ కోసం వెతుకుతున్నానంటోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టా వేదికగా తెలిపింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ జోడీ తనకోసం కాదు.. సెలబ్రెటీలకు వైద్యం చేసే డాక్టర్ జెవల్ గమాడియా కోసం.

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టింది. శాకుంతలం మూవీతో పెద్ద డిజాస్టర్ ఖాతాలో వేసుకోవడంతో.. తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే సామ్.. ఇప్పుడు మంచి జోడీ కోసం వెతుకుతున్నానంటోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టా వేదికగా తెలిపింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ జోడీ తనకోసం కాదు.. సెలబ్రెటీలకు వైద్యం చేసే డాక్టర్ జెవల్ గమాడియా కోసం. ‘డాక్టర్ జెవల్ గమాడియాకు సరిపోయే మ్యాచ్ కోసం వెతుకుతున్నాం. అతడు కనిపించేదానికంటే తెలివైనవాడు’ అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

ఇంతకీ ఆ డాక్టర్ ఎవరంటే.. అతను ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రెటీలకు వైద్యం చేశారు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్, అజయ్ దేవగణ్.. ఇలా చాలా మంది తారలకు ఆయన ట్రీట్మెంట్ అందించారు. సెలబ్రిటీలకు ఆయన వెస్టర్న్‌ అక్యుపెంచర్‌ ద్వారా చికిత్స అందిస్తారు. సమంత పెట్టిన పోస్ట్‌ చూస్తుంటే తాజాగా తను కూడా ఆ జాబితాలో చేరిపోయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సామ్.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ సినిమాతోపాటు.. సిటాడెల్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button