Entertainment

Bollywood : బాలీవుడ్ బడా హీరోల ప్రాణాలకు ముప్పు.. భద్రత పెంచిన ప్రభుత్వం..


ఇప్పటికే ఒక గ్యాంగ్ సల్మాన్ ను చంపడానికి చూస్తున్నారు కూడా.. సల్మాన్ ఖాన్ ను ఎలాగైనా చంపుతాం అని ఒక గ్యాంగ్ తిరుగుతోన్న విషయం తెలిసిందే.. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలేను కాల్చిచంపిన బిష్ణోయ్ గ్యాంగ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా సల్మాన్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాదు ఈ స్టార్ హీరోకు ఎనిమీస్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఒక గ్యాంగ్ సల్మాన్ ను చంపడానికి చూస్తున్నారు కూడా.. సల్మాన్ ఖాన్ ను ఎలాగైనా చంపుతాం అని ఒక గ్యాంగ్ తిరుగుతోన్న విషయం తెలిసిందే.. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలేను కాల్చిచంపిన బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు కూడా ముప్పు పొంచివుంది. సిద్ధూ మూసేవాలా తరహాలో సల్మాన్ ఖాన్ ను కూడా అంతమొందించే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందుతున్నాయి. ఈ క్రమంలో  సల్మాన్ ఖాన్ భద్రతను వై ప్లస్ కేటగిరీకి పెంచారు.

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ వల్ల సల్మాన్ ఖాన్ కు ప్రమాదం వుందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు వై ప్లస్ కేటగిరి భద్రతను పెంచింది. అలాగే మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు ఎక్స్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

సల్మాన్ కు ఇద్దరు గార్డ్ లు భద్రత కల్పిస్తూ ఆయనతోనే ఉంటారు. అలాగే సల్మాన్ ఇంటి వద్ద కూడా ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అక్షయ్ కుమార్ ఇంటికి కూడా భద్రత పెంచారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కు కూడా అక్కడి ప్రభుత్వం వై ప్లస్ భద్రతని కల్పించింది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button