News

Salman Khan: సల్మాన్ ఖాన్‌లో స్పెషల్ అదే.. వైరల్‌గా మారిన సుధా మూర్తి కామెంట్స్ – Telugu News | Sudha Murty says Salman Khan has a childlike innocence and fit for Bajrangi Bhaijaan


బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు సల్మాన్ ఖాన్. ఆయనకు నార్త్‌తో పాటు సౌత్‌‌లోనూ ఫ్యాన్స్‌కు కొదవలేదు. తాజాగా సల్మాన్ ఖాన్‌పై ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్, పద్మశ్రీ సుధా మూర్తి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Sudha Murthy Comments on Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు సల్మాన్ ఖాన్. ఆయనకు నార్త్‌తో పాటు సౌత్‌‌లోనూ ఫ్యాన్స్‌కు కొదవలేదు. తాజాగా సల్మాన్ ఖాన్‌పై ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్, పద్మశ్రీ సుధా మూర్తి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సల్మాన్ ఖాన్ ముఖంలో పసితనం కనిపిస్తుందంటూ కపిల్ శర్మ షోలో ఆమె కామెంట్స్ చేశారు. అందుకే భజరంగి భాయ్‌జాన్ మూవీలో ఆ పాత్రకు సల్మాన్ ఖాన్ అన్ని రకాలుగా అర్హులంటూ కామెంట్ చేశారు. ఇదే విషయాన్ని తన కుమార్తెకు కూడా చెప్పినట్లు తెలిపారు.  ఆ పాత్రను సల్మాన్ ఖాన్ మినహా మరెవరూ పోషించలేరని అభిప్రాయపడ్డారు సుధా మూర్తి.

సోషల్ మీడియాలో ఈ వీడియోను సల్మాన్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌ను ప్రశంసిస్తూ సుధా మూర్తి చేసిన కామెంట్స్ తమను ఎంతో సంతోషానికి గురిచేస్తున్నట్లు సల్మాన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



ఇదే షోలో మరో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను దిలీప్ కుమార్‌తో పోల్చారు సుధా మూర్తి. చిన్నతనంలో తనకు దిలీప్ కుమార్ మూవీస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. దిలీప్ కుమార్ తరహాలో ఎమోషన్స్ పండించగల సామర్థ్యం షారుఖ్‌కి ఉందని వ్యాఖ్యానించారు. షారుఖ్‌పై సుధామూర్తి కామెంట్స్‌కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  సుధా మూర్తి కామెంట్స్ పట్ల షారుఖ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

మరిన్ని సినిమా వార్తలు చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button