News

sajjanar twitter video, జేసీబీ డ్రైవర్ చేసిన పనికి TSRTC ఎండీ సజ్జనార్ ఫిదా! – tsrtc md sajjanar congratulated the jcb driver for saving dog


TSRTC MD VC Sajjanar: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందిరికీ తెలిసిందే. ఆయన నిత్యం ఏదో ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రజలకు జాగ్రత్తలు చెప్పటం, అవగాహన కల్పించటం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే వెంటనే స్పందిస్తారు. సంస్థలో పని చేసే వారిని ఎప్పటికప్పుడు పోత్సహిస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసిస్తూ ఉంటారు.

తాజాగా.. ఓ జేసీబీ డ్రైవర్ చేసిన పనికి సజ్జనార్ సార్ ఫిధా అయ్యారు. ఓ కుక్క పెద్ద గుంతలో పడిపోయి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతోంది. అక్కడే పని చేస్తున్న ఓ జేసీబీ డ్రైవర్ కుక్క పడుతున్న అవస్థలను గమనించాడు. జేసీబీ బొక్కెన సాయంతో కుక్కను సురక్షితంగా గుంతలో నుంచి బయటకు తీసి కాపాడుతాడు. అందుకు సంబంధించిన వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన మానవత్వం” అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సజ్జనార్ షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగా ఆకట్టుకుట్టుంది.

ఇక సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజారవాణ సంస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రయాణికుల ఆక్యూపెన్సీ పెచటంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కొత్త బస్సుల కొనుగోళ్లు, కార్గో సేవలు, పెట్రోల్ బంకుల నిర్వహణ, జీవా పేరుతో టీఎస్ ఆర్టీసీ సొంత బ్రాండ్‌తో వాటర్ బాటిళ్ల తయారీ, మహిళల కోసం ప్రత్యేక బస్సులు, నగర శివారులో ఉన్న కాలేజీలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు గాను ప్రత్యేక బస్సులు ఇలా అనేక మార్పులను సజ్జనార్ తీసుకొచ్చారు.

బస్సుల్లో ప్రత్యేక రాయితీలు, సుదూర ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెలకు కూడా బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికుల్లో ఆర్టీసీపై నమ్మకం ఏర్పడింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం ఆర్టీసీ ఆక్యూపెన్సీ పెరిగింది. దాంతో పాటు సంస్థ లాభాల బాటపట్టింది. తాజాగా.. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు ఏసీ స్లీపర్ బస్సులను నడిపేందుకు సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. మెుత్తం 16 బస్సులను నడపనున్నట్లు వెల్లడిచంగా.. ఈనెల 27న బస్సులు ప్రారంభం కానున్నాయి. అశోక్ లేలాండ్ కంపెనీకి బస్సులను ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే నాలుగు బస్సులు సంస్థకు చేరుకోగా.. మిగితా బస్సులు ఈ నెలాఖరులోగా సంస్థకు చేరుకోనున్నాయి.

ఉపాధి పనులు చేస్తుండగా కూలీలకు దొరికిన వెండి నాణేలు.. కానీ అంతలోనే..

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button