News

Sai Pallavi: అతడితో తొలిచూపులోనే ప్రేమలో పడిన సాయి పల్లవి.. ఏకంగా లవ్ లెటర్ రాసిందట.. – Telugu News | Do you know actress Sai Pallavi Wrote Love Letter In 7th Class telugu cinema news


పడి పడి లేచే మనసు.. మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలతో అలరించింది. చివరగా గార్గి చిత్రంలో కనిపించింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన కొత్త ప్రాజెక్ట్ చేస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ సినీప్రియులంతా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకునే హీరోయిన్ సాయి పల్లవి. ఫిదా సినిమాతో ఆడియన్స్ హృదయాలను దొచేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలోనే ప్రత్యేకం. సినీ పరిశ్రమలో ఈ అమ్మడుకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. క్లీన్ అండ్ గ్రీన్ హీరోయిన్‏గా పేరు సంపాదించుకుంది. హీరోయిన్ పాత్రకు సరైన ప్రాదాన్యత ఉండి.. తనకు కంఫర్ట్ గా ఉన్న రోల్స్ మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అచ్చ తెలుగమ్మాయిగా కనిపిస్తూ అభిమానులను సొంతం చేసుకుంది. పడి పడి లేచే మనసు.. మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలతో అలరించింది. చివరగా గార్గి చిత్రంలో కనిపించింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన కొత్త ప్రాజెక్ట్ చేస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

సినిమా.. కుటుంబం తప్ప మరో ధ్యాస లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. గతంలో ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. అలాగని ఆ బంధాన్ని మాత్రం ఎప్పుడూ గౌరవిస్తానని తెలిపింది. ప్రేమ పెళ్లి అయితే ఇంకా బాగుంటుందని కేవలం అది తన అభిప్రాయం మాత్రమే అని తెలిపింది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి ఎవరితోనూ ప్రేమలో లేదు.. కానీ స్కూల్ డేస్ సమయంలోనే ఓ కుర్రాడిని తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిందట. అతడిని చాలా సీరియస్ గా లవ్ చేసిందట. అంతేకాకుండా.. ఆ అబ్బాయికి ఏకంగా ప్రేమ లేఖ రాసిందట. అయితే నేరుగా అతడికి ఇవ్వాలంటే భయపడి తన పుస్తకంలో దాసుకుందట. ఇక ఆ లెటర్ వాళ్ల అమ్మ కంట పడడం.. ఆమె సాయి పల్లవిని కొట్టడం జరిగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇక ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ప్రేమలేఖల జోలికి వెళ్లలేదని తెలిపింది. ఇప్పటికీ తన తల్లికి తెలియకుండా ఎక్కువగా ఖర్చులు చేయనని… తాను ఏమి తీసుకున్న ఓటీపీ వాళ్ల అమ్మ ఫోన్ కు వెళ్తుందని చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ మూవీ తర్వాత ఆమెకు ఎక్కువగానే అవకాశాలు వచ్చినప్పటికీ పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడంతో రిజెక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button