News

Russia Ukraine War: కీవ్‌తో సహా పలు నగరాలపై క్షిపణుల దాడి.. ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా ..


క్రిమియాపై డ్రోన్‌ దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడులు చేసినట్టు పుతిన్‌ ప్రకటించారు. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో కీలకమైన మౌలిక సదుపాయల వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ మిస్సైళ్ల వర్షం కురిపించింది. పవర్‌ ప్లాంట్లే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు పూర్తిగా సమర్ధించుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. క్రిమియాపై డ్రోన్‌ దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడులు చేసినట్టు పుతిన్‌ ప్రకటించారు. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో కీలకమైన మౌలిక సదుపాయల వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కీవ్‌లోనే 10 భారీ పేలుళ్లు జరిగాయి . నగరంలోని చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఖర్కీవ్‌లోని ముఖ్యమైన మౌలిక వసతి భవనాలు దెబ్బతిన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. కీవ్‌లోని విద్యుత్తు కేంద్రం ఈ క్షిపణి దాడిలో దెబ్బతింది. దీంతో 3.5 లక్షల అపార్ట్‌మెంట్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. . ల్వీవ్‌, జపొరిజియా, డెనిప్రోపెట్రోవస్క్‌ నగరాలపై కూడా దాడులు జరిగాయి. నీపర్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్లాంట్‌పై రూడా రష్యా స్ట్రాటిజిక్‌ బాంబర్లను వాడింది.

అయితే రష్యా ప్రయోగించిన చాలా క్షిపణులను తాము కూల్చి వేసినట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ అధికారులు తెలిపారు. రష్యా దాడుల కారణంగా తాము కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చిందని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్‌ చేసింది.

క్రిమియాలోని కీలకమైన సెవస్తపోల్‌ సైనిక నౌకాస్థావరంపై శనివారం ఉక్రెయిన్‌ 16 డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా యుద్ధనౌకలను ధ్వంసం చేసింది. రష్యా మాత్రం.. దాడులను తిప్పికొట్టామని, డ్రోన్లన్నింటినీ నేలకూల్చామని పేర్కొంది. . సెవస్తపోల్‌.. నల్లసముద్రంలో రష్యా నౌకాదళానికి ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచి అటు అజోవ్‌ సముద్ర తీరాన్ని ఇటు నల్ల సముద్ర తీరాన్ని మాస్కో నియంత్రిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button