Entertainment

Aditi Rao Hydari – Siddharth: డేటింగ్ నిజమేనా? సిద్ధార్థ్‌తో కలిసి అదితి సూపర్బ్ డ్యాన్స్‌.. వీడియో వైరల్


Basha Shek

Basha Shek |

Updated on: Feb 28, 2023 | 6:20 AM

ఈ మధ్యకాలంలో పలు ఫంక్షన్లు, సినిమా ఈవెంట్లు, పార్టీల్లో జంటగానే కనిపిస్తున్నారు అదితి, సిద్ధార్థ్‌. ఇటీవల శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు కూడా జంటగానే హాజరయ్యారు. అయితే తమ రిలేషన్‌షిప్‌పై అటు అదితి కానీ, సిద్ధార్థ్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేసిన దాఖలాలు లేవు.

Aditi Rao Hydari - Siddharth: డేటింగ్ నిజమేనా? సిద్ధార్థ్‌తో కలిసి అదితి సూపర్బ్ డ్యాన్స్‌.. వీడియో వైరల్

Aditi Rao Hydari, Siddharth

స్టార్‌ హీరోయిన్‌ అదితిరావు హైదరీ, హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉందని గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. గతంలో వీరిద్దరు మహాసముద్రం అనే సినిమాలో జంటగా నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్లు వస్తున్నాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఈ మధ్యకాలంలో పలు ఫంక్షన్లు, సినిమా ఈవెంట్లు, పార్టీల్లో జంటగానే కనిపిస్తున్నారు అదితి, సిద్ధార్థ్‌. ఇటీవల శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు కూడా జంటగానే హాజరయ్యారు. అయితే తమ రిలేషన్‌షిప్‌పై అటు అదితి కానీ, సిద్ధార్థ్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేసిన దాఖలాలు లేవు. ఈ సంగతి అలా ఉంచితే తాజాగా సిద్ధార్థ్‌తో కలిసి డ్యాన్స్‌ చేసింది అదితి. ఓ ట్రెండింగ్‌ సాంగ్‌కు ఇద్దరూ కలిసి ఎంతో హుషారుగా స్టెప్పులేశారు. అనంతరం ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారీ లవ్‌ బర్డ్స్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు సుమారు 3.5 లక్షలకు పైగా లైకులు రావడం విశేషం.

యాపిల్‌ బ్యూటీ హన్సిక, దియా మీర్జా లాంటి సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఈ వీడియోను చూసి తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘త్వరగా మీ లవ్ అనౌన్స్ చేయండి’ ‘లవ్ లవ్, ఈసారి ఈ కోతుల నుంచి ఇంకా ప్రేమ కావాలి ‘ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా అదితి- సిద్ధార్థ్‌ త్వరలోనే తమ బంధాన్ని అధికారికంగా చేసి వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సిద్ధార్థ గతంలో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోగా అదితీరావు హైదరి సైతంపెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఎలాంటి సినిమాలకు ఒప్పుకోకపోవడం పెళ్లి వార్తలకు బలాన్నిస్తోంది.

Advertisement

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button