Romancham: రూ. 2 కోట్లతో తీస్తే.. రూ. 50 కోట్ల కలెక్షన్స్… ఇంకా.. ఇదేం సినిమా సామీ…
కంటెంట్ బాగుంటే చాలు.. క్యాస్టింగ్‌తో పనిలేదు.. బడ్జెత్‌తో పనిలేదు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే రోమాంచం మూవీ మరో ఉదాహారణ.
సరైన కంటెంట్ కోసం.. ఫిల్మ్ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచంలోని ఏ భాషలో.. మంచి సినిమా వచ్చినా.. దాన్ని ఎలాగోలా చూసేస్తున్నారు. అంతలా మంచి మూవీస్‌ను.. మంచి కంటెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. కథ నచ్చకుంటే అందులో ఎంత భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నా.. రిజెక్ట్ చేస్తున్నారు. మాకు బడ్జెట్‌తో పనిలేదు.. మంచి కంటెంట్‌తో మాత్రమే పని అని చెప్పకనే చెప్పేస్తున్నారు. తెలుగులో ‘పెళ్లి చూపులు’, తమిళ్‌లో లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ ‘లవ్ టుడే’ అలాంటి సినిమాలే. ఈ మధ్య కాలంలో కన్నడ మూవీ ‘కాంతార’ సైతం ప్రపంచవ్యాప్తంగా.. సంచలన విజయం సాధించింది. ఇక మలయాళ మేకర్స్.. ఎప్పుడూ ఫిల్మ్ లవర్స్‌ను థ్రిల్ చేస్తూనే ఉంటారు. ఆ లిస్ట్‌లో తాజాగా ‘రోమాంచం’ చేరింది.
కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా కొట్టగొట్టింది. ఇందులో పెద్ద.. పెద్ద యాక్టర్స్ ఎవరూ లేరు. మలయాళ సినిమాల్లో బాగా కనిపించే సౌబిన్ షాహిర్ మెయిన్ లీడ్ చేశాడు. 2007 సంవత్సరం నేఫథ్యంలో హర్రర్-కామెడీ జోనర్‌లో కథను అల్లుకున్నారు. వినోదం కోసం ఓయిజా గేమ్ ఆడే కొంతమంది ఫ్లాట్‌మేట్స్ చుట్టూ తిరుగుతుంది. జిత్తు మాధవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి.. రిలీజ్‌కు ముందు డిస్ట్రిబ్యూటర్లు దొరకడమే గగనమైంది.
కానీ థియేటర్లలో విడుదలయ్యాక మాత్రం దుమ్మురేపింది. ఫిబ్రవరి 3న విడుదలై, నెల రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది రోమాంచం మూవీ. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకునేందుకు తెలుగు, తమిళ నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..