Entertainment

Kantara : రిషబ్ శెట్టిని కలిసిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. కాంతార సినిమాపై ప్రశంసలు కురిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్..


తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కాంతార చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాదు హీరో రిషబ్ శెట్టిని స్వయంగా కలిసి అతడిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ప్రస్తుతం ప్రపంచదేశాలు తెలుగు సినిమాలపై ఆసక్తిని చూపిస్తున్నాయి. బాహుబలి.. ఆర్ఆర్ఆర్.. పుష్ప, కేజీఎఫ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా విదేశీయులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై..ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. తక్కువ సమయంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సక్సెస్‍ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా పై సామాన్యులే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు.. క్రికెటర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కాంతార చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాదు హీరో రిషబ్ శెట్టిని స్వయంగా కలిసి అతడిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

హీరో రిషబ్ శెట్టి ఇటీవల దక్షిణాఫ్రికా మాజీ అంతర్జాతీయ క్రికెటర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ ఏబీ డివిలియర్స్ కలుసుకున్నారు. కాంతార చిత్రం అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం.. కర్ణాటక, కేరళ ఆదివాసీల భూతకోల సంప్రదాయాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అదిరిపోయిందని.. ప్రతి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



అయితే ఈ సినిమా ఓ వైపు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంటే.. మరోవైపు వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ మూవీలోని వరాహా రూపం సాంగ్.. తన నవరసం పాట నుంచి కాపీ చేశారంటూ మలయాళం ఇండస్ట్రీకి చెందిన తుక్కుడం బ్రిడ్జ్ యూనిట్ ఆరోపించింది. ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించగా.. వరహా రూపం సాంగ్ థియేటర్లలో .. సోషల్ మీడియాలో ప్లే చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button