News

rilee rossouw, SA vs BAN: రూసో శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోరు.. చివర్లో సత్తా చాటిన బంగ్లా బౌలర్లు – rilee rossouw ton helps south africa to score set 206 runs target to bangladesh


సిడ్నీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. రైలీ రూసో శతకం బాదడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి ఓవర్లోనే కెప్టెన్ బవూమా వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో లేని బవూమాను బంగ్లా పేసర్ టస్కిన్ అహ్మద్ ఔట్ చేశాడు. కెప్టెన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిలే రూసో.. మరో ఓపెనర్ డికాక్‌తో కలిసి దూకుడుగా ఆడాడు.

రూసో (1056 బంతుల్లో 109), డికాక్ (63) రెండో వికెట్‌కు 168 పరుగులు జోడించారు. ఏ టీ20 వరల్డ్ కప్‌లోనైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. 38 బంతుల్లో 68 రన్స్ చేసిన డికాక్‌ను అఫిఫ్ ఔట్ చేసి బంగ్లాదేశ్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆరంభం నుంచి డికాక్ కంటే వేగంగా ఆడిన రూసో.. 53 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఇదే తొలి శతకం కావడం గమనార్హం. టీ20ల్లో రూసోకు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ అతడే కావడం విశేషం.

14 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 165 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా 225 పరుగులు చేసేలా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో బంగ్లా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఐదు ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు.18వ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చిన హసన్. ఆఖరి ఓవర్లో 7 రన్స్ ఇచ్చి మర్‌క్రమ్‌ను ఔట్ చేశాడు. 19వ ఓవర్‌లో షకీబ్ 4 రన్స్ మాత్రమే ఇచ్చి రూసోను పెవిలియన్ చేర్చాడు. దీంతో సౌతాఫ్రికా 205 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్‌కు రెండు వికెట్లు దక్కగా.. టస్కిన్ అహ్మద్, హసన్ ముహ్మద్, అఫిఫ్ తలో వికెట్ తీశారు.

Related Articles

Back to top button