News
revanth reddy, Komatireddy Venkat Reddy: రేవంత్ చాలా పెద్ద తప్పు చేశాడు.. ఆయన మొహం కూడా చూడను – congress mp komatireddy venkat reddy sensational comments on revanth reddy
Authored by Veeresh Billa | Samayam Telugu | Updated: Aug 5, 2022, 12:20 PM
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని.. ఇకపై ఆయన మొహం కూడా
ప్రధానాంశాలు:
- రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశాడు
- మునుగోడు ఇప్పట్లో వెళ్లను
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి తాజాగా రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పట్లో మునుగోడు వెళ్లనని, పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతే వెళ్తానని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని, తనను ఓడించాలనుకున్న చెరుకు సుధాకర్ని కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారని వెంకట్రెడ్డి ప్రశ్నించారు. ఇకపై రేవంత్ రెడ్డి మొహం కూడా చూడనని స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా తమతో టచ్లో ఉన్నారంటూ గురువారం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసిన వెంకట్రెడ్డి.. రాజగోపాల్రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే తన నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డితో మరింత దూరం పెరిగిందన్న సంకేతాలిస్తున్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్లో కొనసాగుతారా? లేక సోదరుడి బాటలోనే పయనిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
Web Title : Telugu News from Samayam Telugu, TIL Network
Advertisement