News

revanth reddy, ఎంగిలి మెతుకులు, కాంట్రాక్టుల కోసం ఆశపడి.. కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు – tpcc chief revanth reddy comments on komatireddy raj gopal reddy and munugode by polls


ఎంగిలి మెతుకులకు ఆశపడి, సొంత వ్యాపార ఆర్థిక లావాదేవీల కోసం, కాంట్రాక్టుల కోసం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి లాంటి సోనియా గాంధీని.. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఈడీ దాడులతో వేధిస్తుంటే, కన్నకొడుకులా పోరాటం చేయాల్సిన సమయంలో రహస్య ఒప్పందాలు చేసుకొని పార్టీ మారుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విశ్వాసఘాతుకులను కాంగ్రెస్ పార్టీయే కాదు, యావత్ తెలంగాణ సమాజం క్షమించదని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని.. ఈ నెల 5న మునుగోడు నియోజకవర్గంలో సమావేశంతో ఎన్నికల శంఖారావం పూరిస్తామని ఆయన చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ముందుండి నడిపిస్తారని ప్రకటించారు.

‘ఆత్మగౌరవం, బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు. తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ అయినా.. తాము చచ్చేంత వరకు మోదీని క్షమించడు. అలాంటి మోదీని తెలంగాణ సమాజం బహిష్కరించాలి. కానీ, ఎంగిలి మెతుకుల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, కాంట్రాక్టుల కోసం.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించేలా కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారు. కుట్రలు చేస్తున్నారు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

75 ఏళ్ల వయసులో కరోనాతో ఇబ్బందులు పడుతున్న సోనియా గాంధీని మహిళ అనే కనికరం కూడా లేకుండా ఈడీ విచారణకు రావాల్సిందేనని హుకుం జారీ చేశారని.. అమిత్ షా, మోదీ ద్వయం ఆమెను తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు. కానీ, 4 కోట్ల ప్రజలకు కనిపించే తల్లి సోనియమ్మ. ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఏపీలో పార్టీ సచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా.. ఇక్కడి ప్రజలను గౌరవించి రాష్ట్రం ఇచ్చారు. ఎవడైనా తన తల్లిని అవమానిస్తే.. తల తెగనరికే అవసరం ఉన్న వేళ, సోనియా గాంధీని అవమానిస్తుంటే.. అమిత్ షా దగ్గర కూర్చొని కాంట్రాక్టుల ఒప్పందం చేసుకున్నారు. మోదీ, అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సమయంలో విశ్వాసఘాతకులుగా మారారు. ఇలాంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదు’ అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Related Articles

Back to top button