News

Restrictions: ఇకపై అమ్మాయిలు ఫోన్‌ వాడటంపై నిషేధం..! సంచలన నిర్ణయం | Thakur Community on Restrictions on the use of mobile phones by women in Gujarat Telugu News video


టెక్నాలజీ పెరిగాక.. సెల్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ చిన్న పెద్దా తేడా లేకుండా అందరి చేతుల్లో ఉంటోంది. అయితే అమ్మాయిలు మొబైల్ వాడటం వల్ల ఘోరాలు జరిగిపోతున్నాయంటున్నారు…

టెక్నాలజీ పెరిగాక.. సెల్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ చిన్న పెద్దా తేడా లేకుండా అందరి చేతుల్లో ఉంటోంది. అయితే అమ్మాయిలు మొబైల్ వాడటం వల్ల ఘోరాలు జరిగిపోతున్నాయంటున్నారు ఓ కమ్యూనిటీ పెద్దలు. దీంతో అమ్మాయిలు మొబైల్ వాడటంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా ఓ ఎమ్మెల్యే సాక్షిగా తీర్మానం చేశారు. దీంతో మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుజరాత్‌లోని ఠాకూర్ కమ్యూనిటీ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కులానికి చెంది కుటుంబాల జీవితంలో మెరుగుదల కోసం సెల్ ఫోన్ వాడకంపై విధించింది. ఇందులో భాగంగా అమ్మాయిలు మొబైల్ వాడకూడదనే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం పట్ల అక్కడి అమ్మాయిలు కోపంతో రగిలిపోతున్నారు. నేటి సమాజంలో లింగ బేధాలు లేకుండా ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా మహిళలు ఎదుగుతుండగా.. ఠాకూర్ కమ్యూనిటీ ఇలాంటి ఉత్తర్వులు జారిచేయడంతో మహిళలు మండిపడుతున్నారు.అమ్మాయిలు మొబైల్ ఫోన్ వాడటం వల్ల అబ్బాయిలతో పరిచయాలు పెరిగి, కులాంతర వివాహాలు, ప్రేమ సంబంధాలు ఎక్కువయ్యాయంటున్నారు ఠాకూర్ కమ్యూనిటీ పెద్దలు. ముఖ్యంగా మైనర్ బాలికలు వీటికి బలి అయిపోతున్నారంటున్నారు. వీటిని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుల పెద్దలు చెబుతున్నారు. దీంతో పాటు పలు కీలక తీర్మానాలు చేశారు. ఎక్కడైనా పెళ్లి లేదా నిశ్చితార్థం జరిగితే దానికి కేవలం 11 మంది మాత్రమే హాజరు కావాలని నిర్ణయించారు. దీంతో కుటుంబాలకు పెళ్లి ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. అలాగే పెళ్లిళ్లు సాదాసీదాగా జరగాలని, సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించారు. పెళ్లి అయినం తరువాత ఎవరైనా విడిపోవాలని చూస్తే ఆ కుటుంబానికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Advertisement

Related Articles

Back to top button