News

Reserve Bank Of India,RBI: దివాలా అంచున మరో బ్యాంక్‌.. ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు.. మీకు ఖాతా ఉందేమో చూసుకోండి? – rbi imposes restrictions on colour merchants cooperative bank ahmedabad


RBI: బ్యాంకింగ్ వ్యవస్థ రెగ్యులేటరీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ దేశీయ బ్యాంకులపై గట్టి నిఘా వేసింది. గత వారం రోజులుగా పలు కోఆఫరేటివి బ్యాంకులతో పాటు ఎస్‌బీఐ సహా మూడు షెడ్యూల్డ్ బ్యాంకులకూ పెనాల్టీలు విధించిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరో బ్యాంకుకు గట్టి షాక్ ఇచ్చింది. దివాలా అంచుకు చేరుకున్న క్రమంలో ఆంక్షలు విధించింది. అహ్మదాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న కలర్ మర్చంట్స్ కో ఆపరేటివ్ బ్యాంకుపై పలు ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారిన క్రమంలో లావాదేవీలపై ఆంక్షలు పెట్టింది. ఒక కస్టమర్ గరిష్ఠంగా రూ. 50 వేలకు మించి విత్ డ్రా చేసుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 25 నుంచే అమలులోకి వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం.. ఆర్‌బీఐ అనుమతి లేకుండా కలర్ మర్చంట్స్ కోఆఫరేటివ్ బ్యాంక్ కొత్తగా ఎలాంటి లోన్స్ ఇవ్వడం, పాత రుణాలను రెన్యువల్ చేయడం, కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లను తీసుకోవడం చేయకూడదు. కొత్తగా ఎలాంటి కార్యకలాపాలు చేయాలన్నా ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి చేసింది. ‘బ్యాంకులో సేవింగ్స్ ఖాతా, కరెంట్ ఖాతా వంటి ఏ ఇతర అకౌంట్లు ఉన్నా నగదు విత్ డ్రా రూ. 50 వేలకు మించకూడదు’ అని తెలిపింది ఆర్‌బీఐ. అలాగే బ్యాంకు దివాలా తీసినట్లయితే అర్హులైన డిపాజిటర్లకు రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా బీమా కవరేజీ ఉంటుందని తెలిపింది. బ్యాంక్ కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆంక్షల పరిధిలోనే లావాదేవీలు కొనసాగుతాయని తెలిపింది.

బ్యాంకులో డబ్బులు దాచుకున్న డిపాజిటర్లు ఇతర పూర్తి వివరాల కోసం బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించింది ఆర్‌బీఐ. అయితే, బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే ఉద్దేశంతో మాత్రం ఈ ఆంక్షలు విధంచలేదని, బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగు పడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడే వరకు ఆంక్షల పరిధిలోనే బ్యాంకు బ్యాంకింగ్ బిజినెస్ కొనసాగిస్తుందని తెలిపింది. పరిస్థితులను బట్టి ఆంక్షల్లో మార్పులు చేసే అవకాశం ఉందని కస్టమర్లలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది.

Also Read: Banks: మరో 4 బ్యాంకులకు గట్టి షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ.. వాటిల్లో మీకు ఖాతా ఉందా?

Banks: మరో 4 బ్యాంకులకు గట్టి షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ.. వాటిల్లో మీకు ఖాతా ఉందా? RBI: ఎస్‌బీఐ సహా 3 బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. రూల్స్ అతిక్రమణ.. వాటిల్లో మీకు ఖాతా ఉందా? Bank Licence: ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు.. కస్టమర్లకు పెద్ద దెబ్బ.. మీకూ ఖాతా ఉందా చూసుకోండి!

Related Articles

Back to top button