News
Repalle Revenue Division, జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, నెరవేరిన కల! – ap government released final gazette notification for repalle revenue division
Repalle Revenue Division ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తానికి రేపల్లే వాసుల కల నెరవేరింది. ఇప్పటికే ఆర్డీవోను కూడా ప్రభుత్వం నియమించింది.
ప్రధానాంశాలు:
- ఏపీలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
- ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
- బాపట్ల జిల్లాలో మూడో రెవెన్యూ డివిజన్
ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆర్డీవోను కూడా నియమించారు. ఇప్పుడు రేపల్లెను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో తీరప్రాంత ప్రజల కల నిజమైంది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, అమర్తలూరు, చుండూరు, నగరం మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. కొత్తగా రేపల్లె రెవెన్యూ డివిజన్ రావడంతో జిల్లా కేంద్రమైన బాపట్ల డివిజన్ ఆరు మండలాలకే పరిమితమైంది. గతంలో ఉన్న బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలేనికి తోడు పర్చూరు, మార్టూరు యద్ధనపూడితో బాపట్ల రెవెన్యూ డివిజన్‌గా ఉంటుంది.
రేపల్లె రెవెన్యూ డివిజన్లో ప్రస్తుతానికి ఆర్డీవోను నియమించి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే సిబ్బందిని కేటాయించాల్సి ఉంది. రికార్డులను రెవెన్యూ డివిజన్‌గా అనుగుణంగా ఆన్లైన్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపల్లె కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
Web Title : Telugu News from Samayam Telugu, TIL Network
Advertisement