Renuka Chowdary: గుడివాడలో పోటీ పక్కా.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రేణుకా చౌదరి | Renuka Chowdary Gives Clarity On Contest From Gudivada in 2024 Elections Telugu News
ఏపీ, తెలంగాణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రేణుకాచౌదరి. నేను తెలుగు భాష లెక్క… ఇక్కడా ఉంటా, అక్కడా ఉంటా అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టార్గెట్‌గా ఈ కామెంట్స్ చేశారు రేణుక.
హాట్ కామెంట్స్‌తో హీట్ పుట్టించే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి ఈసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది కూడా వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తోన్న గుడివాడ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు చెప్పారు. మొన్నటివరకూ ఉమ్మడి రాష్ట్రమే కదా… ఏపీలో పోటీ చేస్తే తప్పేంటి అన్నారు. ఏపీలో పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని, అందుకే గుడివాడపై ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటోన్న రేణుకాచౌదరి… గుడివాడ కూడా తన మనసులో ఉందన్నారు. రెండు చోట్లా పోటీ చేయడంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు రేణుక. ఎవరొచ్చినా స్వాగతిస్తామంటూనే… ఎక్కడా దిక్కులేని వాళ్లకు కాంగ్రెస్ దిక్కంటూ సెటైర్లు వేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..