Rent Receipts,IT Returns: ఐటీ రిటర్న్స్‌లో ఇలా చేస్తున్నారా? అడ్డంగా దొరికిపోతున్నారు.. భారీగా పెనాల్టీలు కట్టాల్సిందే..! – claiming fake deductions, rent receipts while filing your itr can lead to heavy penalties
ఆదాయపు పన్ను శాఖ.. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో, చేసిన తర్వాత కూడా మీరు క్లెయిమ్ చేసిన టాక్స్ డిడక్షన్స్, టాక్స్ ఎక్జెంప్షన్స్‌కు సంబంధించి ప్రూఫ్స్ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఈ ఆర్థిక సంవత్సరానిదైనా కావొచ్చు.. అంతకుముందుదైనా కావొచ్చు. ఆధారం సమర్పించిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.
IT Employees: పెద్ద స్కెచ్చే వేసిన దిగ్గజ ఐటీ కంపెనీ.. ఒకేసారి ఏకంగా 8 వేల మంది ఉద్యోగులకు!
Mukesh Ambani: ఆ లగ్జరీ ఇల్లు అమ్మేసిన రిలయన్స్ బాస్ అంబానీ.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
అయితే ఒకవేళ మీరు ఆధారాలు సమర్పించకపోయినా.. ఆదాయపు పన్ను శాఖ దానితో సంతృప్తి చెందకపోయినా ఆ పన్ను మినహాయింపును నిరాధారంగా పరిగణిస్తారు. అలాంటి సమయంలో మీకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని సార్లు జైలు శిక్ష కూడా పడొచ్చు. తప్పుడు క్లెయిమ్స్.. ఆదాయాన్ని తప్పుగా చూపించినట్లే అవుతుందని చెబుతున్నారు టాక్స్ ఎక్స్‌పర్ట్స్. కొన్ని సార్లు ఫేక్ రిసిప్ట్స్, ఫేక్ డిడక్షన్స్ చేస్తూ తప్పు చేస్తుంటారని అలా చేయొద్దని అంటున్నారు.
”ఫేక్ రెంట్ రిసిప్ట్స్ (నకిలీ అద్దె రశీదులు) ద్వారా అధిక హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును క్లెయిమ్ చేయడం లేదా ఎలాంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ లేకుండా ఛాప్టర్ VI-A కింద డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం అనేది 1961, ఆదాయపు పన్ను చట్టం కింద వాస్తవాలను తప్పుగా చూపడంగా పరిగణించబడుతుంది.” అని చెప్పారు బిజినెస్ కన్సల్టింగ్ గ్రూప్ DVS అడ్వైజర్స్ ఫౌండర్ అండ్ సీఈఓ దివాకర్ విజయసారథి. ఇటీవల 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిలో పలువురికి వారు క్లెయిమ్ చేసిన డిడక్షన్స్ ప్రూఫ్స్ సమర్పించాలని ఐటీ శాఖ నోటీసులు కూడా పంపించింది.
DA Hike: ఉద్యోగులకు శుభవార్త.. డీఏ మరో 3 శాతం పెంపు పక్కా.. కోట్లాది మందికి పెరగనున్న జీతం!
Bank Service Charges: బ్యాంక్ సేవలపై సర్వీస్ ఛార్జీలు.. ఎస్‌బీఐలో బాదుడే బాదుడు.. కచ్చితంగా తెలుసుకోవాల్సినవి
Read Latest Business News and Telugu News