rbl bank, Savings Account: గుడ్‌న్యూస్.. ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులుంటే చాలు అధిక వడ్డీ.. ఎంత శాతమంటే? – rbl bank hikes savings account interest rates up to 6.50 percent effective from today
ఏ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అన్నింటి లిస్ట్ ఇదే..
డైలీ బ్యాలెన్స్ రూ.లక్ష వరకు ఉన్న కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేటును 4.25 శాతంగా నిర్ణయించింది RBL బ్యాంకు. రూ.లక్ష అంతకంటే ఎక్కువ గరిష్టంగా రూ.10 లక్షలు డైలీ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసే అకౌంట్ హోల్డర్లకు 5.50 శాతం మేర వడ్డీ అందనుంది. ఇంకా రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసే వారికి ఆర్బీఎల్ బ్యాంక్ 6 శాతం వడ్డీగా నిర్ణయించింది. ఇక రూ.25 లక్షల నుంచి గరిష్టంగా రూ.7.5 కోట్ల బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసే వారికి అత్యధికంగా 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది RBL బ్యాంక్.
టీకొట్టుకు ఇంత డిమాండా? నెలకు రూ.3.25 లక్షల రెంట్.. 45 లక్షల అడ్వాన్స్..
RBL బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును రోజువారీ ముగింపు బ్యాలెన్స్‌ను బట్టి నిర్ణయిస్తుంటుంది. దీనిని ప్రతి త్రైమాసికానికి ఒకసారి జమ చేస్తుంటుంది. సాధారణంగా చాలా వరకు బ్యాంకులు ఇదే పద్ధతిని అమలు చేస్తుంటాయి. ఇంకా చాలా వరకు సేవింగ్స్ అకౌంట్లపై బ్యాంకులు వడ్డీ రేటు అందిస్తాయని చాలా మందికి తెలిసుండదు. సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండటంతో పాటు.. బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా మెయింటెయిన్ చేస్తే వడ్డీ రేటును ప్రతి 3 నెలలకోసారి లేదా 6 నెలలకోసారి చెల్లిస్తుంటాయి. ఇంకా కొన్ని వార్షిక ప్రాతిపదికన ఇస్తుంటాయి.
ఉదాహరణకు దిగ్గజ ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు.. అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 లక్షల్లోపు ఉంటే 3 శాతం, రూ.50 లక్షల కంటే ఎక్కువ ఉంటే 3.5 శాతం చొప్పున వడ్డీ అందిస్తుంటాయి. ఈ వడ్డీని ఎలా లెక్కిస్తాయో ఇక్కడ చూడండి.
- Read Latest Business News and Telugu News
Also Read: సీనియర్లకు ఊతం.. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్.. వారికి మరింత బూస్ట్.. బడ్జెట్ అంచనాలివే!