rbi rule violations, రూల్స్ తప్పితే RBI ఊరుకుంటుందా మరి? HDFCకి కర్రు కాల్చి వాత పెట్టింది! – rbi imposes monetary penalty on hdfc and igh holdings for rule violations
మరో కంపెనీపైనా మానిటరీ పెనాల్టీ..
ముంబాయికి చెందిన ఐజీహెచ్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ (IGH Holdings) నిబంధనలు ఉల్లంఘించిన క్రమంలో రూ.11.25 లక్షలు పెనాల్టీ విధించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది ఆర్‌బీఐ. 2020-21 ఆర్థిక ఏడాదికి సంబంధిచి రిసర్వ్ ఫండ్స్‌పై నెట్ ప్రాఫిట్స్‌లోని 20 శాతం తమ కస్టమర్లకు తర్జుమా చేయడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే సీఐసీకి కూడా ఎలాంటి క్రెడిట్ సమాచారాన్ని అందించలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే కంపెనీకి నోటీసులు ఇచ్చామని, దానిపై సమాధానం ఇచ్చిన తర్వాతే నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించి పెనాల్టి వేసినట్లు స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అవకతవకలకు పాల్పడుతున్న బ్యాంకులు, పైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవలే మధ్య ప్రదేశ్‌లోని ఓ కోఆపరేటివ్ బ్యాంక్ దివాలా తీయడంతో దాని లైసెన్స్ రద్దు చేసింది. ఆ తర్వాత మరో 5 కోఆపరేటివ్ బ్యాంకులపై ఆంక్షలు విధించింది. అలాగే నాలుగు రోజుల క్రితంలో దేశంలోని 17 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. వాటి నుంచ సీఓఆర్‌ను స్వాధీనం చేసుకుంది.
- Read Latest Business News and Telugu News