News
rbi imposes penalty, RBI: కొరఢా ఝుళిపించిన ఆర్‌బీఐ.. దిగ్గజ బ్యాంకుకు భారీ జరిమానా.. కారణం ఇదే! – rbi reserve bank of india imposes rs 2 92 crore penalty on canara bank
రుణ అర్హత లేని సంస్థల పేరిటపలు సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్లు తెరిపించిందని, పలు క్రెడిట్ కార్డుల ఖాతాల్లో డమ్మీ మొబైల్ నంబర్లు కనిపించాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అలాగే రోజువారీ డిపాజిట్ పథకం కింద ఎటువంటి వడ్డీని చెల్లించలేదని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. వాస్తవ వినియోగ పద్ధతిని అనుసరించకుండా కస్టమర్ల నుంచి ఎస్ఎంఎస్ వంటి ఛార్జీలను రికవరీ చేసిందని పేర్కొంది. ఖాతాదారుల ప్రొఫైల్‌కు సంబంధం లేకుండా లావాదేవీలు జరిగితే హెచ్చరించే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడంలోనూ కెనరా బ్యాంక్ విఫలమైందని.. ఇలా పలు అంశాలకు సంబంధించి బ్యాంకుకు నోటీసులు జారీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. నిర్ణీత గడువులోగా ఎందుకు జరిమానా విధించకూడదో తెలియజేయాలని కోరామని, అయితే, బ్యాంకు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో జరిమానా విధించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో పలు కోఆపరేటివ్ బ్యాంకులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసింది. అలాగే 17 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల లైసెన్సులను రద్దు చేసింది. మరి కొన్నింటిపై కఠిన ఆంక్షలు విధించింది. దేశంలోని పెద్ద బ్యాంకులకు సైతం భారీగా జరిమానా విధిస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ప్రజల ఆర్థిక లావాదేవీల్లో కీలకమైన బ్యాంకులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగించే విషయమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని సార్లు హెచ్చరించిన పలు బ్యాంకుల తీరు మారడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక బ్యాంకు డొల్లతనం బయటపడుతూనే ఉంది.
- Read Latest Business News and Telugu News