Rayapati Sambasiva Rao, ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోతారు.. కడప వాళ్లకు పల్నాడులో సీటెలా ఇస్తారు: టీడీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు – rayapati sambasiva rao sensational comments on alliance with janasena party and narasaraopet tdp mp seat
తన కుమారుడు రంగారావు సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ సీట్లు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. తాను కూడా గతంలో టీడీపీ అధిష్టానాన్ని రెండు సీట్లు అడిగానని.. తమ కుమారుడు, కుమార్తె కోసం సీటు అడిగానన్నారు.. అధిష్టానం ఇంకా సమాధానం చెప్పలేదన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు వేరే వాళ్లకు ఎలా ఇస్తారని.. కడప వ్యక్తిని తీసుకొచ్చి నర్సరావుపేటలో పోటీ చేయిస్తే ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఆ వ్యక్తికి ఎందుకిస్తున్నారో తెలియడం లేదన్నారు.
నరసరావుపేట ఎంపీ సీటు తనకు కాకపోతే తన కుమారుడికి ఇవ్వాలని కోరారు. అవసరమైతే తాను కూడా పోటీకి సిద్ధమన్నారు. తాను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికి రారని.. తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తాము కష్టపడతాం, తమకు సీటు ఇవ్వాలి అన్నారు. టీడీపీ సీట్ల కోసం అందరు ఎగబడుతున్నారని.. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జనాలు బాగా వస్తున్నారన్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని.. అందుకే చాలామంది సీట్లు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. పార్టీని నమ్ముకున్నవాళ్లకు సీట్లు ఇవ్వాలని.. నర్సరావుపేట ఎంపీ సీటు మాత్రం తమకే ఇవ్వాలని కోరారు.
తనకు తెలియకుండా వేరేవాళ్లకు నరసరావుపేట ఎంపీ సీటు ఇస్తే ఓడిపోతారని.. తాము కూడా సహకరించేది లేదన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కష్టపడ్డానని.. ఆ ఏరియాను డెవలప్ చేశాను అన్నారు. రాజకీయ వారసులకు సీట్లు ఇవ్వాలి.. లేకపోతే పార్టీకి ఇబ్బంది అవుతుందన్నారు. అలాగే తాడికొండ సీటును తోకల రాజవర్ధన్రావుకు ఇవ్వాలని.. ఆయన అక్కడ గెలుస్తారన్నారు. ఇక జనసేన పార్టీతో పొత్తు ఉంటే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాయపాటి సాంబశివరావు గతంలో గుంటూరు ఎంపీగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి రాజకీయాల్లో ఆయన పెద్దగా యాక్టివ్గా లేరు. అయితే తమ వారసులకు మాత్రం టికెట్ కావాలని కోరుతున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News