Entertainment

Ravi Teja: మాస్ రాజా మూవీ కోసం ఏకంగా ఐదుగురు స్టార్స్.. ఒకొక్క భాషలో ఒకొక్కరు..


Raviteja

మాస్ మహారాజ రవితేజ హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రావణాసుర సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే  రీసెంట్ గా  అడుగుపెట్టిన ఈ సినిమా అక్కడ మాత్రం మంచి వ్యూస్ ను రాబడుతోంది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో  ప్రేకాదరణ పొందుతోంది ఈ సినిమా.. ఇదిలా  ఉంటే ఈ సినిమా తర్వాత ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల  ముందుకు రానున్నారు మాస్ రాజా. మాస్ మహారాజా నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు`. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది.

ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటె ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ యూ రిలీజ్ చేయనున్నారు.

ఈ నెల 24వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. సౌత్, నార్త్ నుంచి ఐదుగురు సీనియర్ స్టార్ హీరోలతో ఫస్టులుక్ ను రిలీజ్ చేయించనున్నట్టు చెప్పారు. హిందీలో సల్మాన్ .. తమిళంలో రజనీ .. మలయాళంలో మోహన్ లాల్ .. కన్నడలో శివరాజ్ కుమార్ ఈ ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే తెలుగులో ఏ స్టార్ హీరో రిలీజ్ చేస్తారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

 

Related Articles

Back to top button