Rathika Pallavi Prashanth,Bigg Boss Today Promo: ప్రోమో: రతికపై చేయి వేసిన పల్లవి ప్రశాంత్.. రెచ్చిపోయిన రతి పాప.. చిల్లరదంటూ రైతు బిడ్డ ఏడుపు – rathika rose strong warning to pallavi prashanth at bigg boss telugu 7 day 16 promo
ఇక పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ తనని ఎంపిక చేయకపోవడంపై తెగ ఫీల్ అయిపోయాడు. బిగ్ బాస్ మనసులో ఓడిపోయినా అంటూ ఏడ్వడం స్టార్ట్ చేశారు. ఆ తరువాత ఒక్కొక్కరు.. నామినేషన్స్‌లో మాదిరే పనికి మాలిన కారణాలే చెప్పారు. దామిని ఏదో మాస్టర్ మైండ్స్ అన్నట్టుగా.. ప్రిన్స్‌కి ప్రిన్స్ లేదని.. చెప్పి అనర్హుడిగా ప్రకటిస్తుంది.
ఇక మన కంటెంట్ క్రియేటర్ రతి పాప అయితే పల్లవి ప్రశాంత్‌తో కావాలని కెలికించుకుని గొడవ పడుతుంది. అసలు వీళ్లు ఎందుకు గొడవ పడ్డారు? ఎందుకు దూషించుకున్నారో.. చివర్లో ఉంది అసలు ట్విస్ట్. ప్రశాంత్ ముఖంపై వేలు పెట్టి మరీ రతి పాప వార్నింగ్ ఇవ్వడంతో.. ‘పో తల్లీ పో.. పక్కకి పో’ అని ప్రశాంత్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ రతి పాప వినిపించుకోకుండా.. ‘ప్రశాంత్ మీది మీదికి వెళ్లి.. వేలు చూపిస్తూ.. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్.. మళ్లీ మళ్లీ చెప్తున్నా కూడా ఎక్కువ మాట్లాడుతున్నావ్’ అని ముఖంపై వేలు పెట్టి చూపించింది రతిక. దీంతో మనోడికి మండి.. ‘ఎహే.. పక్కకి పో’ అని రతికపై చేయి వేసి పక్కకి నెట్టాడు.
దీంతో మన రతిపాప రెచ్చిపోయింది. ‘ఏయ్.. ఇంకోసారి మీద చేయి వేశావ్ అంటే బాగోదు.. మర్యాదగా ఉండదు చెప్తున్నా’ అని ఫుటేజ్ కోసం పెద్ద సీన్ చేసింది రతిక. ప్రశాంత్ ఇంతకు ముందెప్పుడూ తనపై చేయి వేయనట్టు తెగ రెచ్చిపోయింది రతిక. నీ గుండెల్లో నేను లేనా? నీ మనసులో నేను లేనా? నీ మనసులో ఉన్న మాట నాకు చెప్పెయ్.. చెప్పెయ్ అంటూ అతని పక్కనే కూర్చుని గోరు ముద్దులు పెట్టినప్పుడు ఏమైపోయింది పాపా ఈ కోపం..? ఎంతైనా కంటెంట్ ఇవ్వాలంటే నీ తరువాత ఎవరైనా అన్నట్టుగా చెలరేగిపోయింది రతిక. అందుకే రతిక వేషాలు చూసిన ప్రశాంత్.. ‘చిల్లరది.. చిల్లర వేషాలు’ అని ఒక్కమాటతో తేల్చిపడేశాడు.
అయితే అసలు వీళ్లిద్దరూ ఇలా గొడవ పడటానికి కారణం ఏంటంటే.. కంటెంట్ కోసమే. గతంలో శివాజీ హౌస్‌లో ఉన్న వాళ్లని ఎలాగైతే వెర్రిపప్పల్ని చేశాడో.. ఇప్పుడు వీళ్లు కూడా అదే తరహాలో కంటెంట్ ఇవ్వడం కోసం ఈ డ్రామా ప్లే చేస్తున్నారని లైవ్ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ చెప్తున్న మాట. యాక్టర్ శివాజీ డైరెక్షన్‌లో వీళ్లు ఫ్రాంక్ చేస్తున్నారట. మరి నిజమో కాదో.. నేటి ఎపిసోడ్‌లో చూదాల్సిందే.