Entertainment

Rashmika Mandanna: టాప్ గేర్ లో దూసుకుపోతోన్న నేషనల్ క్రాష్.. వారసుడు పై బోలెడన్ని ఆశలతో అమ్మడు


కన్నడ నుంచి తెలుగుకు.. ఇక్కడి నుంచి తమిళ్ కు.. ఇప్పుడు అక్కడ నుంచి హిందీకి ఇలా గేర్ మారుస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ . వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న రష్మిక

టాలీవుడ్ లో ఈ మధ్య టాప్ బ్యూటీ ఎవరు అంటే కాస్త గట్టిగానే చెప్తున్నా పేరు రష్మిక మందన్న. ఈ అమ్మడి ఎనర్జీకి అడ్డుకట్ట వేయడం ఎవరితరం కావడం లేదు.. కన్నడ నుంచి తెలుగుకు.. ఇక్కడి నుంచి తమిళ్ కు.. ఇప్పుడు అక్కడ నుంచి హిందీకి ఇలా గేర్ మారుస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ . వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న రష్మిక బడా హీరోలతో జతకడుతూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సామీ సామీ అంటూ లాస్ట్ ఇయర్‌ ఈ పాటికే నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయిపోయారు రష్మిక మందన్న. అందుకు రీజన్‌ పుష్ప. కెరీర్‌ ప్రారంభమైన కొన్నేళ్లలోనే టాప్‌ స్టార్స్ తో నటించే అవకాశాలను అందిపుచ్చుకున్నారు రష్మిక. అల్లు అర్జున్‌ సినిమా కంప్లీట్‌ కాగానే తమిళ దళపతి విజయ్‌తో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు రష్మిక.

తన చిన్నప్పటి క్రష్‌ విజయ్‌తో నటించడం డ్రీమ్‌ కమ్‌ ట్రూ అంటూ తెగ ముచ్చటపడిపోయారు రష్మిక మందన్న. ప్రీవియస్‌ సినిమాల తమిళ ప్రెస్‌మీట్లలోనూ దళపతితో నటించాలని ఉందంటూ మనసులోని మాటను చెప్పేశారు రష్మిక. వంశీపైడిపల్లి డైరక్ట్ చేసిన వారసుడు , వారిసు సినిమాతో అది కాస్తా నెరవేరింది. సంక్రాంతి బరిలో దూకుతోంది విజయ్‌ వారసుడు.

విజయ్‌ సినిమాలు పొంగల్‌ రేసులో ఉండటం తంబిలకు మామూలు విషయమే. కానీ మన దగ్గర మాత్రం ఈ సారి వంశీ పైడిపల్లి అండ్‌ దిల్‌రాజు జతగా విజయ్‌ గట్టిగానే సందడి చేయబోతున్నారు. భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారసుడు కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు రష్మిక మందన్న. ఈ సినిమా హిట్టు కొడితే కోలీవుడ్ లో రష్మిక పేరు మారు మ్రోగడం పక్కా .. అక్కడి స్టార్ హీరోలు ఈ అమ్మడి కోసం క్యూ కట్టడం ఖాయం. మరి విజయ్ సినిమా రష్మికకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button