Entertainment

Kamna Jethmalani: రణం సినిమా బ్యూటీ కామ్నా జఠ్మలానీ షాకింగ్ లుక్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా


ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఆఫర్లు అందక సినిమాలకు దూరమైన భామలు కూడా ఉన్నారు. వీరిలోకొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వగా మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు.

చాలా మంది ముద్దుగుమ్మ కొన్ని సినిమాలతోనే కనుమరుగవుతూ ఉంటారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన భామలు చాలా మందే ఉన్నారు. ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఆఫర్లు అందక సినిమాలకు దూరమైన భామలు కూడా ఉన్నారు. వీరిలోకొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వగా మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తోన్న ముద్దుగుమ్మ గుర్తుందా..? గోపీచంద్ నటించిన రణం సినిమాలో హీరోయిన్ గా నటించింది కామ్నా జఠ్మలానీ . తెలుగులో ఈ భామ 2005లో వచ్చిన ప్రేమికులు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2006 లో గోపీచంద్ హీరోగా నటించిన రణం సినిమాతో హీరోయిన్ గా మంది గుర్తింపు తెచ్చుకుంది. నటనతోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంది ఈ భామ.

ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన బెండు అప్పారావు సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలుంబ్ చేసిన అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇక ఈ భామా 2015లో చివరిగా తెలుగులో చంద్రిక అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.

తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ చివరిగా 2022లో కన్నడ భాషలో గరుడ అనే మూవీ చేసింది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? రణం సినిమాలో క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన కామ్నా ఇప్పుడు కూడా అంతే అందంతో ఆకట్టుకుంటోంది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూస్తే నిజంగానే షాక్ అవుతారు. ఏమాత్రం వన్నెతగ్గని సొగసుతో అభిమానులను ఆకర్షిస్తుంది కామ్నా.. అప్పటికి ఇప్పటికి అంతే అందంగా ఉన్న కామ్నా ఫోటోలకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Advertisement

Related Articles

Back to top button