Entertainment

Ram Gopal Varma : మేయర్ గారు ఆ కుక్కలన్నింటినీ మీ ఇంటికి తీసుకెళ్లండి.. ఆర్జీవీ వరుస ట్వీట్స్


ఏకంగా హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.

వివాదాస్పద ట్వీట్లకు వర్మ విరామం ఇచ్చారని భావించిన వారికి అదేం లేదని తాజా ట్వీట్‌తో తేల్చేశారు రామ్ గోపాల్ వర్మ. ఏకంగా హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.

ఆమె తన కుక్కకు కుడి చేత్తో ఫుడ్‌ తినిపిస్తూ.. ఎడమ చేత్తో తాను తింటున్న వీడియోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. కుక్కలపై మేయర్ గారి ప్రేమ చాలా ఉన్నతంగా ఉంది. కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకెళ్లి ఫుడ్‌ తినిపిస్తే.. అవి మా పిల్లల్ని తినవు అంటూ ట్వీట్‌ చేశారు.

కుక్కలపై ఇంత ప్రేమ చూపిస్తున్న మేయర్‌ .. నగరంలో ఉన్న 5 లక్షల కుక్కలను ఇంటికి తీసుకెళ్లి మధ్యలో కూర్చుంటే బాగుంటుందని కామెంట్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button