Entertainment

Ram Charan: హాలీవుడ్ బిగ్ స్టార్‌ను బీట్ చేసిన మెగా పవర్ స్టార్.. ఖుషీ ఫ్యాన్స్


Ram Charan

ట్రిపుల్ ఆర్ విషయంలో అంతా ఓకే కానీ.. ఆ ఒక్కటే తీరని లోటుగా ఫీలవుతున్నారా..? మన స్టార్‌ హీరోలు కూడా ఓ హాలీవుడ్ అవార్డు నామినేష్లో ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా..? ఆ లోటు ఎప్పుడు తీరుతుందో అని వెయిట్ చేస్తున్నారా.? “డోంట్ వెయిట్” ఎందుకంటే.. ట్రిపుల్ ఆర్ విషయంలో మీరు ఫీలయ్యే తీరని లోటు తీరిపోయింది కనుక! చరణ్‌, తారక్ హాలీవుడ్ అవార్డు నామినేష్లో ఉన్నారు కనుక!

పాన్ ఇండియన్ సినిమాగా మాత్రమే తెరకెక్కిన ట్రిపుల్ ఆర్.. ఆ తరువాత హాలీవుడ్ లో కూడా రిలీజ్ అయి అందర్నీ ఆకట్టుకుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లను కూడా ఫిదా చేసింది. దాదాపు హాలీవుడ్ పాపులర్ అవార్డ్స్ అన్నింటిలో నామినేషన్స్ కూడా సాధించింది. కొన్నింటిని గెలిచింది. కానీ హీరోల కేటగిరీలో మాత్రం టాలీవుడ్ ఫిల్మ్ లవర్స్‌ను.. చెర్రీ తారక్‌ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ అయ్యేలా చేసింది. ఒక్కటంటే ఒక్క నామినేషన్లో కూడా తమ హీరోలు లేరనే నిజం అందర్నీ ఫీల్ అయ్యేలా చేసింది.

అయితే తాజాగా ఈ నిజం అబద్దమైపోయింది. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల నేమ్స్‌ నామినేషన్స్ లలో ఎంట్రీ అయిపోయింది. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లలో ‘బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీస్‌’ కేటగిరీలో చెర్రీ, తారక్ పేరుంది. టామ్ క్రూజ్, బ్రాట్ పిట్, నికోలస్ కేజ్ లాంటి హాలీవుడ్ స్టార్ల మధ్యలో మనోళ్ల పేర్లు ఉండడం ఇప్పుడు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. ప్రతీ తెలుగు వాడిని ప్రౌడ్‌ గా ఫీలయ్యేలా చేస్తోంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా టామ్ క్రూజ్ ను కూడా బీట్ చేశారు. నికోలస్ కేజ్ మొదటి స్థానంలో ఉండగా చరణ్ సెకెండ్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాత టామ్ క్రూజ్ఉన్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related Articles

Back to top button