Entertainment

Ram Charan: రామ్ చరణ్‌ను సత్కరించిన అమిత్ షా.. పుత్రోత్సహంతో మురిసిపోయిన మెగాస్టార్


Ram Charan, Amith Sha

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం తో ప్రతి ఇండియన్ గుండె గర్వంతో నిండిపోయింది. రాజమౌళి దర్శకత్వలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబల్ అవార్డు అందుకోవడంతో పాటు ప్రతిష్ఠహ్మకమైన ఆస్కార్ అవార్డును కూడా అనుకుంది. నాటు నాటు సాంగ్ కు అవార్డు రావడంతో ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించింది. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ సినిమా పై సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

తాజా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను రామ్ చరణ్ కలిశారు. చరణ్ తో పాటు మెగా స్టార్ చిరంజీవి కూడా అమిత్ షా ను కలిశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటనను అభినందించారు అమిత్ షా.. అలాగే నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంపై అమిత్ షా అభినందలు తెలిపారు.

అమిత్ షా చరణ్ ను శాలువాతో సత్కరించారు. పక్కనే ఉన్న చిరు పుత్రోత్సహంతో మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

Related Articles

Back to top button