Rajayogam OTT: క్రైమ్ కామెడీ మూవీ ‘రాజయోగం’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..? | Telugu movie rajayogam streaming on disney hotstar from february 9 Telugu Film News
క్రైమ్ కామెడీ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. అందుకే జోనర్‌లో చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. రాజయోగం కూడా క్రైమ్ కామెడీ సినిమానే.
సాయి రోనక్, అంకిత సాహా, షకలక శంకర్, బిస్మీ నాస్, ప్రవీణ్, గిరి, భద్రం, అజయ్ ఘోష్, తాగుబోతు రమేశ్ తదితరులు కీ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రాజయోగం’. రామ్ గణపతి డైరెక్ట్ చేసిన చిత్రం డిసెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. త్వరలో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
రిషి(సాయి రోనక్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. మెకానిక్‌గా వర్క్ చేస్తూ జీవినం సాగిస్తుంటాడు. ఎప్పటికైనా రిచ్ లైఫ్ బ్రతకాలన్నది అతడి ఆశ. అందుకోసం మంచి డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఓ సారి తాను రిపేర్ చేసిన వెహికల్ ఓనర్‌కు రిటన్ చేసేందకు స్టార్ హోటల్‌కి వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)ను చూసి ఫ్లాటై లవల్‌లో పడతాడు. అయితే ఆమె మాత్రం రిషితో ఇల్లీగల్ రిలేషన్ మెంటైన్ చేస్తూనే.. డేనియల్ (సిజ్జు) వద్ద ఉన్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్)గ్యాంగ్‌తో కలిసిపోతుందిది. దీంతో రిషి.. ఎలాగైన శ్రీ అసలు మెంటాలిటీని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రిషికి చాలెంజులు ఎదురయ్యాయి? రాధా, డేనియల్ మధ్య ఉన్న వజ్రాల వ్యవహారం ఏంటి? డేనియల్ దగ్గర నుంచి రాధా వజ్రాలను తస్కరించాడా? అందుకు శ్రీ ఎలా సాయపడింది? రిషి, శ్రీల మధ్యలోకి వచ్చిన ఐశ్వర్య(బిస్మీనాస్) ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే ‘రాజయోగం’ మూవీని ఓటీటీలో చూడాల్సిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.