Rahul Gandhi,హామీలు ఇస్తున్నాం.. ‘ఆరు’ నూరైనా అమలు చేసి తీరుతాం: రాహుల్ గాంధీ – rahul gandhi announced congress 6 guarantee schemes in tukkuguda meeting
కేవలం ఒక్క కుటుంబం కోసమే సోనియా గాంధీ.. తెలంగాణ ఇవ్వలేదన్నారు రాహుల్. రైతులు, మహిళలు, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందని మండిపడ్డారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ సర్కారును గద్దె దించడం ఖాయమన్నారు. తొమ్మిదేళ్ల బీఆఱ్ఎస్ పాలనలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
హామీల వర్షం..
మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ను వెయ్యి రూపాయలు చేసిందని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. యువ వికాసం కింద యువతకు కాలేజీ, కోచింగ్ ఫీజు కోసం రూ.5లక్షల వరకు ఇస్తాన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.15 వేలు సాయం అందిస్తామన్నారు. చేయూత పింఛను ద్వారా రూ.4 వేలు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఇస్తామంటూ.. తెలంగాణ ప్రజలపై హామీల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ.