Entertainment

Parineeti Chopra: పరిణీతి రాకతో నా జీవితం రంగుల మయం.. కాబోయే సతీమణిపై ప్రేమ ఒలకబోసిన ఆప్ ఎంపీ


బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా త్వరలో తన బ్యాచిలర్‌ లైఫ్‌కు బై బై చెప్పనున్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దాతో కలిసి త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌ బర్డ్స్‌ నిశ్చితార్థం ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది.

Parineeti Chopra: పరిణీతి రాకతో నా జీవితం రంగుల మయం.. కాబోయే సతీమణిపై ప్రేమ ఒలకబోసిన ఆప్ ఎంపీ

Parineeti Chopra, Raghav Chadha

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా త్వరలో తన బ్యాచిలర్‌ లైఫ్‌కు బై బై చెప్పనున్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దాతో కలిసి త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌ బర్డ్స్‌ నిశ్చితార్థం ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. ఈనెల 13వ తేదీన ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే ఈ ప్రేమ పక్షులు ఒకరిపై ఒకరు ప్రేమను తెలుపుకుంటున్నారు. తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రాఘవ్‌ తనకు కాబోయే సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించాడు. పరిణీతి రాకతో తన జీవితం రంగులమయంగా మారిపోయిందన్నాడు. ‘ఒక శుభ ముహూర్తమైన రోజునాడు ఈ అందమైన అమ్మాయి తన జీవితంలోకి వచ్చింది. ఆమె వచ్చిన శుభ ఘడియల నుంచి నా జీవితమే మారిపోయింది. నా జీవితాన్ని పరిణీతి రంగులమయంగా మార్చింది. ఎన్నో నవ్వుల్ని, సంతోషాల్ని తెచ్చింది. నా ఎంగేజ్మెంట్ ఎంతో ఆనందదాయకంగా జరిగింది. ఈ వేడుక ఆనందబాష్పాలు, చిరునవ్వులు, సంతోషాలు, డ్యాన్సులతో నిండిపోయింది. ఈ వేడుక తనకు ఇష్టమైన వారిని మరింత దగ్గర చేసింది’ అంటూ పరిణీతిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు ఆప్‌ ఎంపీ.

ప్రియాంకా చోప్రాకు చెల్లెలు వరుసయ్యే పరిణీతి చోప్రా 2011లో లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాల్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇషాక్‌ జాదే, శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, హస్సీ తో ఫస్సీ, డిష్యూమ్‌, మేరి ప్యార్‌ బిందూ, గోల్‌మాల్‌ అగైన్‌, నమస్తే ఇంగ్లండ్‌, కేసరి, జబ్‌రియా జోడీ, ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌, సైనా తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ సైనా సినిమాలో పరిణీతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఛమ్కీలా, ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్యూ వంటి సినిమాలు ఉన్నాయి. మరి పెళ్లయ్యాక సినిమాలు చేస్తుందో లేదో పరిణీతి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button