Puri Jagannadh: పూరీ, రాజమౌళిల బంధం ఈనాటిది కాదంట.. ఆ రోజులను గుర్తు చేసుకున్న పూరీ జగన్నాథ్..
Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన దర్శకుల్లో రాజమౌళి, పూరీ జగన్నాథ్‌లది ప్రత్యేక స్థానం. ఈ ఇద్దరు డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో గొప్ప సినిమాలను అందించారు…
Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన దర్శకుల్లో రాజమౌళి, పూరీ జగన్నాథ్‌లది ప్రత్యేక స్థానం. ఈ ఇద్దరు డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో గొప్ప సినిమాలను అందించారు. ఒకరేమో అత్యంత వేగంగా సినిమాలు తీసేస్తుంటారు. మరొకరేమో నెమ్మదిగా ఒక్కో సినిమాను మూడు, నాలుగేళ్లు తెరకెక్కిస్తుంటారు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న ఈ ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు ఒకప్పుడు స్నేహితులనే విషయం మీలో ఎంత మందికి తెలుసు.?
తొలిసారి ఈ విషయాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ అధికారికంగా తెలిపారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లైగర్ (Liger) సినిమా ఆగస్టు 25న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సుకుమార్, పూరీతో ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూను నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలోనే పూరీ ఈ విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ.. ‘నేను, రాజమౌళి ఎప్పటి నుంచో స్నేహితులం. ఇంకా ఇండస్ట్రీలోకి రాక ముందు కృష్ణవంశీ చెన్నైలో రాజమౌళిని పరిచయం చేశాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు పెద్ద రచయిత అని మాత్రమే నాకు తెలుసు. రాజమౌళి నాకు పరిచయమయ్యాక.. ఆయనను కలవాలనుకున్నాను. అందుకోసం రాజమౌళిని అడిగాను. దీంతో రాజమౌళి నన్ను వాళ్లింటికి తీసుకెళ్లాడు. అయితే ఇంటి వరకు వెళ్లాను కానీ, ఆయన్ని ఆ రోజు కలవలేదు’ అని చెప్పుకొచ్చారు.
ఇక విజయేంద్ర ప్రసాద్ పూరీ ఫొటోను మొబైల్ ఫోన్ స్క్రీన్ సేవర్‌గా పెట్టుకోవడంపై స్పందించిన పూరీ.. ‘విజయేంద్రప్రసాద్ గారు నన్నెంతో ఇష్టపడుతుంటారు. పైకి శత్రువను చెబుతుంటారు కానీ అది అబద్ధం’ అని అసలు విషయం బయటపెట్టాడు ఈ ఇస్మార్ట్ డైరెక్టర్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..