Puri Jagannadh: హిట్ ఇచ్చిన హీరోతో పూరి మరోసారి.. ‘దిమాక్ ఖరాబ్ అనౌన్స్‌మెంట్’ వచ్చేస్తోంది.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ మూవీ భారీ వైఫల్యం మూటగట్టుకోవడంతో ఒక్కసారిగా ఢిలా పడ్డాడు. లైగర్‌తో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చేయడం కూడా పూరికి తలనొప్పిగా మారింది…
పూరి జగన్నాథ్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ మూవీ భారీ వైఫల్యం మూటగట్టుకోవడంతో ఒక్కసారిగా ఢిలా పడ్డాడు. లైగర్‌తో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చేయడం కూడా పూరికి తలనొప్పిగా మారింది. దీంతో పూరికి ఇప్పుడు ఉన్నపలంగా ఒక భారీ విజయం అవసరం. ఆ దిశగానే పూరి అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. తనకు హిట్ ఇచ్చిన హీరోతో చేతులు కలపనున్నాడు. ఆదివారం ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.? సినిమా ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లా్ల్సిందే..
వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సమయంలో పూరికి ఈస్మార్ట్ శంకర్‌తో భారీ విజయం లభించింది. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఊహకందని విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ. 75 కోట్లకుపైగా వసూలు చేసింది. 2019లో పూరి కనెక్ట్స్ పతాకంపై వచ్చిన ఈ చిత్రం పూరి కెరీర్‌ను మరోసారి మలుపు తిప్పింది. తనకు హిట్ ఇచ్చిన హీరోతోనే మరోసారి చేతులు కలిపేందుకు పూరి సిద్ధమయ్యాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ పూరి జగన్నాథ్ చిత్ర నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ స్పెషల్ అప్‌డేట్‌ను ఇచ్చారు. ‘నాలుగేళ్ల తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి పనిచేయబోతున్నారు. దిమాక్ ఖరాబ్ అనౌన్స్‌మెంట్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు రానుంది’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ఈస్మార్ట్ శంకర్‌కి సీక్వెలేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అప్‌డేట్ ఏంటో తెలియాలంటే మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..