News

punjab kings, DC vs PBKS: పంజాబ్‌పై టాస్ గెలిచిన ఢిల్లీ.. పంజాబ్‌కి చావోరేవో – delhi capitals vs punjab kings ipl 2023 match toss updates from delhi


పంజాబ్ కింగ్స్‌తో శనివారం రాత్రి జరుగుతున్న ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. తాజా సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి.

పంజాబ్ కింగ్స్: ప్రభసిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శామ్ కరన్, సికిందర్ రజా, షారూక్ ఖాన్, హర్‌ప్రీత్ బరార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రొసౌ, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబె, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్

ఐపీఎల్ 2023 సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలోనూ ఆ జట్టు 8 పాయింట్లతో చిట్టచివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు ఢిల్లీ తప్పుకోగా.. ఇక ప్రత్యర్థుల అవకాశాల్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా 11 మ్యాచ్‌లాడి గెలిచింది కేవలం ఐదింట్లోనే. దాంతో 10 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో పంజాబ్ కొనసాగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో పంజాబ్ ఓడితే? ప్లేఆఫ్స్ అవకాశాలకి దాదాపు తెరపడినట్లే.

Related Articles

Back to top button