Entertainment

Priyanka Chopra: ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ విజయం వెనక భారీ కుట్ర ?.. కిరీటం కోసం తోటివారిని తొక్కేసిందా..?


చురకత్తి కంటే అందమైన మోసమే పదునైనది అంటోంది మాజీ మిస్‌ బార్బడోస్‌ లీలాని..ఇన్నేళ్లు కామ్‌గా ఉండి.. 22 ఏళ్ల తర్వాత తన అంతరంగాన్ని బయటపెట్టింది.. 2000 సంవత్సరంలో జరిగిన అందాల పోటీల్లో ప్రియాంక చోప్రా..మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకుంది.

మాజీ అందాల తార ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని అప్పటి మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పార్టిసిపేట్‌ చేసిన మాజీ మిస్‌ బార్బడోస్‌ లీలాని ఆరోపిస్తోంది.. 22 ఏళ్ల కిందట జరిగినదంతా గూడుపుఠాణీ అంటోంది. మరి ఇన్నేళ్లు ఎందుకు చెప్పలేదమ్మా అని నెటిజన్లు కూడా లీలానిపై ఫైరవుతున్నారు.. లీలాని ప్రస్తుతం యూట్యూబర్ గా పనిచేస్తోంది. ప్రియాంక మిస్ వరల్డ్ టైటిల్ గెలవడం వెనక మోసం జరిగిందని ఓ వీడియోలో వెల్లడించిన లీలాని.. ఇటీవల మిస్ యూఎస్ఏ 2022 టైటిల్ లో అవకతవకలను ప్రస్తావించింది. మిస్ యూఎస్ఏ 2022 టైటిల్ నిర్వహణ తర్వాత టైటిల్ నిర్ణయం వెనక కుట్ర జరిగిందని ఆరోపించిన కంటెస్టెంట్లు.. నిర్వాహక సంస్థ ఆర్ బొన్నీ గాబ్రియేల్ పట్ల పక్షపాతం చూపెట్టారని మిగతా కంటెస్టెంట్లు విమర్శించారు.

చురకత్తి కంటే అందమైన మోసమే పదునైనది అంటోంది మాజీ మిస్‌ బార్బడోస్‌ లీలాని..ఇన్నేళ్లు కామ్‌గా ఉండి.. 22 ఏళ్ల తర్వాత తన అంతరంగాన్ని బయటపెట్టింది.. 2000 సంవత్సరంలో జరిగిన అందాల పోటీల్లో ప్రియాంక చోప్రా..మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకుంది. గ్లామర్‌ ప్రపంచంలో ఎంతో పోటీ ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రా తనదైన శైలిలో..న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు అందమైన జవాబులు చెప్పి.. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఒక్కసారి మిస్‌ వరల్డ్‌ అయ్యాక..ప్రియాంక చోప్రా లైఫ్‌ పూర్తిగా మారిపోయింది. అందాల పోటీ వరకు..మోడలింగ్‌ ప్రపంచానికి తప్ప ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు.. మిస్‌ వరల్డ్‌ అయ్యాక ప్రపంచం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది..బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోయింది. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ మెరుస్తోంది..అక్కడా బిజీ అయిపోయింది..ఇక అడ్వర్‌టైజ్‌మెంట్లకు కొదవే లేదు. రెండు చేతులా సంపాదన, కావాల్సినంత పేరు, పబ్లిసిటీ ప్రియాంక హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ రెడీగా ఉంటాయి..

హ్యాపీగా సాగుతున్న ప్రియాంక చోప్రా జీవితంపై ఇప్పుడో మరక పడింది. ఆ మరక మంచిదేనా..ఎంత ఉతికినా పోని జిడ్డు మరకనా అంటే..కాలమే చెప్పాలి.. 22 ఏళ్ల తర్వాత ఆమెకు బ్యాడ్‌ టైమ్‌ ఏమైనా మొదలవనుందా..మొదలవుతోందా అని సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ స్కై లిమిట్ అన్నట్లున్నాయి.. సడెన్‌గా మాజీ మిస్‌ బార్బడోస్‌ లీలాని సెన్సేషన్‌ కామెంట్స్ తో ఒక్కసారిగా ప్రియాంకను సర్చింజన్‌లో నెటిజన్లు తవ్వేస్తునారు. అప్పట్లో ఏం జరిగింది.. ఇప్పుడేం జరుగుతోంది. ప్రియాంక చోప్రా కూడా అలాంటి మనిషేనా.. ట్యాలెంట్‌ను తొక్కేసి తను కిరీటం ఎత్తుకెళ్లిందా..మిస్‌ వరల్డ్‌ పోటీల్లో గెలవడానికి గేమ్స్‌ ఆడిందా అని రకరకాలుగా చాటింగ్స్‌, డిస్కషన్లు, అబ్బో భూమండలంలోని అన్ని ఖండాల్లోని సోషల్‌ మీడియాలో ఇదే టాపిక్‌..

ప్రియాంక మిస్‌ వరల్డ్‌ టైటిల్‌పై లీలాని విమర్శలు చేయడం ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రియాంక మిస్‌ వరల్డ్‌ టైటిల్ నెగ్గడానికి..నిర్వాహకులు ఇతరులను మోసంచేశారని లీలాని చెబుతోంది. యూ ట్యూబర్‌ అయిన లీలాని..తన చానెల్లో..ఈ విషయాన్ని బయటపెట్టింది.. 2000 సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వాహక సంస్థ ఆర్‌ బోన్నీ గాబ్రియేల్‌..ప్రియాంక చోప్రాకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చింది. ప్రియాంక గెలుపునకు నిర్వాహకులు అనుకూలంగా వ్యవహరించారని బోరుమంది.

1999లో మిస్ వరల్డ్ ఇండియాకే దక్కింది మిస్ వరల్డ్ 2000 టైటిల్ కూడా ఇండియాకే దక్కింది ఎలా అంటూ లీలాని ప్రశ్నించింది బీచ్ ప్రదర్శనలో ప్రియాంక బికినీ ధరించినప్పుడు నడుముచుట్టు సరాంగ్(వస్త్రం) చుట్టుకునేందుకు అనుమతించిన నిర్వాహకులు మిగతావారికి ఆవిధంగా అనుమతించలేదని.. ప్రియాంక ధరించిన గౌనును మిగతావారికి భిన్నంగా నాణ్యంగా అందంగా తయారుచేయించారని ఆరోపించింది లీలాని. ప్రియాంకు మంచి రూమ్ ఇవ్వడంతో పాటు, రూములోకి ఆహారాన్ని సరఫరా చేశారని.. వేదికపై స్కిన్ కలర్ మార్చుకునేందుకు నిర్వాహకులు ప్రియాంకకు క్రీములు రాసుకునేందుకు అనుమతించారని ఆరోపించింది.

Advertisement

ఇవి కూడా చదవండిఅంతేకాకుండా.. ఆ పోటీల్లో ఒకానొక సమయంలో..ప్రియాంక తనని చాలా విసిగించిందంట..తనను కావాలనే మోసం చేసి.. తనకు దక్కాల్సిన కిరీటాన్ని ప్రియాంక ఎగరేసుకుపోయిందని లీలాని చెబుతోంది.. . లీలాని మాటలతో కొందరు షాకవుతున్నా..మరికొందరు మాత్రం ఇన్నేళ్లు ఎందుకు చెప్పలేదంటూ..రివర్స్‌లో కౌంటరిస్తున్నారు. ప్రియాంకకు మద్దతు ఇస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button