Entertainment

Priyanka Chopra: వరుస బెట్టి ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెట్టేస్తోన్న ప్రియాంక చోప్రా.. కారణమేంటంటే?


ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలోనే స్థిరపడింది. ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోందీ గ్లోబల్‌ స్టార్‌. ప్రియాంక బాలీవుడ్‌ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్‌ టైగర్‌ అనే హిందీ సినిమాలో నటించింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే సెటిలైన ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు అక్కడే రెస్టారెంట్‌ బిజినెస్‌ కూడా ప్రారంభించిందట. అయితే పండగలు, విశేష పర్వదినాల్లో తప్పకుండా ఇండియాకు వస్తోంది ప్రియాంక. తన కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్స్‌ చేరుకుంటోంది. ఇదిలా ఉంటే హిందీలో సినిమాలు చేసే సమయంలో ముంబైలో పలు ఆస్తులు కొనుగోలు చేసింది ప్రియాంక. అయితే ఇప్పుడు వీటన్నింటిని అమ్మకానికి పెట్టేసిందని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది. గతేడాదే తన పేరిట ఉన్న కొన్ని ఆస్తులను విక్రయించిందీ గ్లోబల్‌ బ్యూటీ. ఇప్పుడు మరో రెండు పెంట్ హౌస్ లు అమ్మేసిందట. దీపావళి వేడుకల కోసం ప్రియాంక ముంబైకి వచ్చింది. ఈ సమయంలో, ముంబైలోని అంధేరిలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ చౌబేకి విక్రయించిందంట. అందుకు ప్రతిఫలంగా రూ.6 కోట్లు తీసుకుందని గుసగుసలు వినిపిస్తు్న్నాయి. ఓషివారాలోని ఓ పెంట్‌హౌస్‌ను రూ.2.25 కోట్లకు, రెండో పెంట్‌హౌస్‌ను రూ.3.75 కోట్లకు విక్రయించారు.ఈ రెండు ఆస్తుల విక్రయానికి గానూ సుమారు 36 లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించింద ప్రియాంక. అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ లావాదేవీలు జరిగాయట.

కాగా ప్రియాంక చోప్రా తన ఆస్తులన్నింటినీ విక్రయిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇండియాతో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ముంబైలో వరుస బెట్టి తన ఆస్తులను అమ్మకానికి పెడుతోందని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు ఇంగ్లిష్ సీరియల్స్, సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో సీజన్‌ షూటింగ్‌లో బిజీగా ఉంటోందీ గ్లోబల్‌ స్టార్‌. అలాగే హెడ్స్ ఆఫ్ స్టేట్ తో పాటు పలు వెబ్‌సీరీస్‌ల్లోనూ నటిస్తోందీ అందాల తార. ఆ మధ్యన ఓ హిందీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినా ఏమైందో తెలియదు కానీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

ఇవి కూడా చదవండి

కూతురుతో ప్రియాంక చోప్రా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Related Articles

Back to top button