News

Prithvi Shaw,ఇదేందయ్యా ఇది.. 154 బంతుల్లోనే 244 రన్స్ చేసిన పృథ్వి షా, రికార్డులు బద్దలు – prithvi shaw smashes 244 in just 153 balls for northomptonshire in county cricket


ఇటీవల ఫామ్ లేక తంటాలు పడుతున్న టీమిండియా యువ బ్యాటర్, ముంబయి ఆటగాడు పృథ్వి షా అదరగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ దేశవాలీ వన్డే టోర్నీ, మెట్రో బ్యాంక్‌ వన్డే కప్‌లో నార్తంప్టన్ షైర్ తరఫున ఆడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్‌సెట్‌తో ఆగస్టు 9న జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లోనే 244 పరుగులు చేసి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు కొట్టాడు. అందులో 28 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండటం విశేషం. పృథ్వి షా చెలరేగడంతో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్‌ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగులు నమోదు చేసింది.

ఈ మ్యాచులో సెంచరీ చేసేందుకు 81 బంతులు ఆడిన పృథ్విషా.. తర్వాత ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. మరో 48 బంతుల్లో మరో వంద పరుగులు చేశాడు. ఫలితంగా 129 బంతుల్లోనే డబుల్ సెంచరీ స్కోరు చేశాడు. చివరకు 153 బంతుల్లో 244 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన బ్యాటింగ్‌తో సోమర్‌సెట్‌ బౌలర్లను రఫ్ఫాడించాడు షా.

ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచుల్లో 60 పరుగులు చేశాడు ఈ యువ బ్యాటర్. మూడో మ్యాచులోనే డబుల్ సెంచరీ స్కోరు చేశాడు. టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డున తన పేరిట(244 రన్స్) లిఖించుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.
కెక్కాడు. ఇంగ్లాండ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ(129 బంతుల్లో) చేసిన ఆటగాడు పృథ్విషానే.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 2 దేశాల్లో డబుల్‌ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు పృథ్విషానే కావడం గమనార్హం. భారత దేశవాళీ టోర్నీలోనూ షా డబుల్ సెంచరీ స్కోరు చేశాడు. మొత్తంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 3 సార్లు ఈ ఫీట్ సాధించగా.. పృథ్విషా రెండు సార్లు రెండొందల స్కోరు చేశాడు.
ఇందరు ముంబయికి చెందిన ఆటగాళ్లే కావడం విశేషం.

ఇక ఈ యువ బ్యాటర్ రాణించడం పట్ల అతడి ఐపీఎల్‌లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న దిల్లీ క్యాపిటల్స్ అభిమానులు కుషీలో ఉన్నారు. ఇదే జోష్‌ను వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొనసాగించాలి బ్రో అని కామెంట్లు చేస్తున్నారు. దెబ్బకు టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని అని ఆకాంక్షిస్తున్నారు.

అరుదైన రికార్డు బద్దలు కొట్టిన సూరీడు.. క్రిస్ గేల్‌ను సైతం వెనక్కినెట్టి

Related Articles

Back to top button