News

Pravalika Boyfriend,ప్రవళిక కేసులో మరో ట్విస్ట్.. కోర్టులో లొంగిపోయిన ప్రియుడు శివరాం..! – pravalika boyfriend shivaram rathod surrender in nampally court


తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రవళిక చనిపోయిన తర్వాత రెండు రోజుల పాటు.. గ్రూప్-2 పరీక్ష వాయిదా వల్లే ఆమె చనిపోయిందంటూ పెద్ద ఎత్తున ఆరోపిస్తూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, రాజకీయ నేతలు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రవళిక ఆత్మహత్యకు గ్రూప్-2 పరీక్ష వాయిదా కారణం కాదని.. ప్రేమ వ్యవహారమే అసలు కారణమని తేల్చారు. శివరాం అనే యువకునితో ప్రవళిక ప్రేమలో ఉందని.. అతను వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవటంతో మోసపోయానన్న బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. కాగా.. ప్రవళిక తల్లిదండ్రులు కూడా.. ఆత్మహత్య రోజున పరీక్షల వాయిదా వల్లే తమ కూతురు మరణించిందని బోరుమన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. శివరాం అనే యువకుని వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని ఓ వీడియో విడుదల చేశారు. తమ కూతురు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులమొద్దని నేతలకు విజ్ఞప్తు కూడా చేశారు.

అయితే.. తమ కూతురు చనిపోవటానికి కారణమైన శివరాం అనే యువకుని మాత్రం కఠిన శిక్ష పడేలా చూడాలని.. అటు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రవళిక కుటుంబం వేడుకుంది. కాగా.. మొదట ప్రవళిక సూసైడ్‌ను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత మరో కొన్ని సెక్షన్లు యాడ్ చేశారు. అప్పటి నుంచి శివరాంను వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కట్ చేస్తే.. నాంపల్లి కోర్టులో శివరాం రాథోడ్ లొంగిపోయాడు. తాను లొంగిపోతున్నట్టు నాంపల్లి కోర్టులో సర్రెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. కాగా.. శివరాంకు నాంపల్లి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. నాంపల్లి 9 మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట శివరాం రాథోడ్ లొంగిపోయాడు. శివరాంను రిమాండ్‌కు తీసుకుని విచారిస్తే మరిన్నీ కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అయితే.. ఇప్పటికే శివరాం, ప్రవళిక కలిసి టిఫిన్ సెంటర్‌కు వెళ్లి సీసీ ఫుటేజీలు, వాళ్లిద్దరి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ, కాల్ డేటా లాంటి ఆధారాలు తమ దగ్గరున్నాయని పోలీసులు తెలిపారు. కాగా.. ఇప్పుడు శివరాం కూడా లొంగిపోవటం… అతన్ని విచారించి అన్ని విషయాలు బయటపెట్టనున్నారు పోలీసులు. అయితే… పోలీసులు చెప్పిన విషయాలను ప్రతిపక్షాలు మాత్రం ఏ కోణానా కూడా ఒప్పుకోవటం లేదు. ప్రభుత్వం కావాలనే కేసును పక్కదారి పట్టిస్తోందంటూ కీలక ఆరోపణలు చేస్తున్నాయి.

బీఆర్ఎస్‌‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్.. ఈ ఎన్నికల్లోనూ ఆ తలనొప్పి తప్పదు..!

Related Articles

Back to top button