Entertainment

Pranitha Subhash: భర్త పాదాలకు పూజ చేస్తే ట్రోల్ చేస్తారా..? ప్రణీత రియాక్షన్ ఇది


ఇటీవల కాలంలో ట్రోలింగ్ పేరు చాలా ఎక్కవగా వినిపిస్తుంది. సెలబ్రెటీలు ఈ పని చేసిన ట్రోల్ చేయడానికి కొందరు నెటిజన్లు రెడీగా ఉంటున్నారు.

ఇటీవల కాలంలో ట్రోలింగ్ పేరు చాలా ఎక్కవగా వినిపిస్తుంది. సెలబ్రెటీలు ఈ పని చేసిన ట్రోల్ చేయడానికి కొందరు నెటిజన్లు రెడీగా ఉంటున్నారు. అది మంచి పైనేనా సరే ఎదో రకంగా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత(Pranitha Subhash)మీదకూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనించింది. ప్రస్తుతం సినిమాలకు గుర్రంగా ఉంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన భర్త పాదాలకు పూజ చేస్తోన్న ఫోటోను షేర్ చేసింది ప్రణీత. భీమన అమావాస్య సందర్భంగా భర్త పాదాలకు పూజ చేసింది ప్రణీత ఆఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే ఈ ఫొటోస్ పై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నావ్ తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం నీ భర్తే నీ కాళ్ళకు పూజ చేయొచ్చుగా నువ్వే ఎందుకు చేశావ్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రణీత ఈ ట్రోల్స్ పై స్పందించింది ” మన జీవితంలో జరిగే ప్రతివిషయాన్ని రెండు కోణాల్లో చూస్తుంటాం.. చాలా మంది దాన్ని పాజిటివ్ గా చూస్తే కొంతమంది మాత్రం నెగిటివ్ గా చూస్తారు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోనూ అని చెప్పుకొచ్చింది. అలాగే నేను ఓ యాక్టర్ ని.. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నత మాత్రాన నేను మన ఆచారాలను, సంప్రదాయాలను మరిచిపోనూ అని తెలిపింది ప్రణీత. నా చిన్నపాటి నుంచి ఇలాంటివి చూస్తూ వస్తోన్నా.. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఈ పూజ చేస్తారు. పెళ్ళైన గత ఏడాది కూడా నేను నా భర్త పాదాలకు పూజ చేశాను. నేనెప్పుడూ పద్దతికలిగిన అమ్మాయిగానే ఉన్నా.. నేను నా కుటుంబ సభ్యుల ఆమధ్య పెరిగాను.. సంప్రదాయాలను, ఆచారాలను, విలువలను గౌరవిస్తుంటాను. మోడ్రన్‌గా ఆలోచించడమంటే మనం నడిచొచ్చిన దారిని మర్చిపోవడం కాదు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రణీత.

Advertisement

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button