prabhu deva, Vishnu Manchu: ప్రభుదేవాపై విష్ణు మంచు కన్ను.. ‘జిన్నా’ ఫ్లాప్ నుంచి ఊరట దక్కేనా! – vishnu manchu planning for his next movie with prabhu deva
విష్ణు మంచు (Vishnu Manchu) టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’ (Ginna). ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తూ ఈషాన్ సూర్య దర్శకత్వంలో సినిమా అక్టోబర్ 21న విడుదలైంది. కమర్షియల్ ఈ సినిమాపై హీరో విష్ణు చాలా ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకున్నారు. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు.. నెక్ట్స్ మూవీని కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవా (Prabhu Deva)తో చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు….
మరి విష్ణు మంచుతో ప్రభుదేవా సినిమా చేస్తారా? అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ప్రభుదేవా ఓకే చెప్పారంటే విష్ణు మంచు కోసం ఎలాంటి కథను చేస్తారనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతం విష్ణు మంచు నిర్మాతగా మోహన్ బాబు (Manchu Mohan Babu)తో అండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.