Entertainment

Prabhas: అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్.. జెట్ స్పీడ్ లో ఆ మూవీ షూటింగ్ కూడా..


భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె… బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవ్వగా.. మరోవైపు మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె… బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ అత్యంత ప్రతిష్ట్మాతంగా నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  ఇప్పటికే  విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. =అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ప్రభాస్  ను ఈ మూవీలో ఎలా చూపించబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక ఇటీవలే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఆయిన స్వప్న దత్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ ఇప్పటివరకు 70 శాతం కంప్లీట్ అయ్యింది.. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోస్ ఈ సినిమాను సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్నాయని.. ప్రాజెక్ట్ కె ఎక్కువగా గ్రాఫిక్స్ తో కూడుకుని ఉంటుందని తెలిపారు. అందుకే ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తైనప్పటికీ వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా సమయం పడుతుందని అన్నారు.

ఇక ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే ఈ నెల ఆఖరుకి సలార్ షూటింగ్ పోర్తయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.వచ్చే నెలలో రాజా డీలాక్స్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని టాక్. వచ్చే నెలలో లాంగ్ షెడ్యూల్ రాజా డీలాక్స్ షూటింగ్ జరగనుందని దాంతో మొత్తం టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుందని టాక్. అలాగే సింగిల్ లొకేషన్ లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట. ఇలా వరుస సినిమాలను కంప్లీట్ చేసి అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ ఇవ్వనున్నారు డార్లింగ్ ప్రభాస్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button