News

prabhas, Swapna Dutt: స్వప్న వస్తే గానీ మాట్లాడను.. స్టేజ్‌పై నవ్వులు పూయించిన ప్రభాస్ – prabhas fun with swapna dutt at sita ramam pre release event


అందమైన ప్రేమకథలు తెరకెక్కించే హను రాఘవపూడి(Hanu Raghavapudi) సీతారామం (Sita Ramam) అనే సినిమాతో ఆగస్ట్ 5న రాబోతోన్నాడు. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunalini thakur), రష్మిక మందన (Rashmika Mandanna), సుమంత్ (Sumanth) కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ప్రభాస్ వచ్చాడు. స్టేజ్ మీద ప్రభాస్ మాట్లాడుతూ.. నవ్వులు పూయించాడు.

స్టేజ్ మీదకు వచ్చిన ప్రభాస్.. తాను మాట్లాడనని మొండికేశాడు. స్వప్నా వస్తే గానీ తాను మాట్లాడను అని అనేశాడు. దీంతో స్వప్నను పిలిచేందుకు సుమ వెళ్లింది.స్వప్న ఎక్కడున్నా రావాల్సిందే అని ప్రభాస్ మైకులో అరిచేశాడు. స్వప్న వస్తే గానీ నేను మాట్లాడను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు.

ఇంతలో స్వప్న వస్తే.. ఏంటి మేకింగ్ వీడియో‌లో ఇలా హీరోయిన్‌ కంటే ఎక్కువగా.. షాట్ వేసుకున్నావ్.. అని కౌంటర్ వేశాడు ప్రభాస్. అందరూ నీ గురించే మాట్లాడుతున్నారేంటి.. ప్రాజెక్ట్ కే కోసం ఎంతలా కష్టపడుతున్నావో నాకు తెలుసు.. మమ్మల్ని ముందు పెట్టి నువ్ వెనకాల ఉంటున్నావ్ ఏంటి.. నువ్ మాట్లాడితేనే నేను మాట్లాడతాను లేదంటే లేదు అంటూ ప్రభాస్ నవ్వులు పూయించాడు.

ఇక స్వప్నా దత్ మాట్లాడిన తరువాతే ప్రభాస్ మళ్లీ మైక్ అందుకున్నాడు. నేను ఈ ఈవెంట్‌కు వచ్చిందే నీ కోసం అంటూ స్వప్న దత్ గురించి గొప్పగా చెప్పేశాడు ప్రభాస్. ఇక ప్రభాస్ స్వప్నతో చేసిన అల్లరికి అందరూ ఫిదా అయ్యారు. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఈ ఎనర్జీని చూసి ఫుల్ ఖుషీ అయ్యారు.

Related Articles

Back to top button