Ppf Calculator,Govt Scheme: కోటీశ్వరులను చేసే కేంద్రం స్కీమ్.. ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి మరి! – how to become a crorepati with a public provident fund account ppf calculator
ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్‌తో చాలా డబ్బు పోగు చేయవచ్చు. ఈ సేవింగ్స్ స్కీమ్ కంపౌండింగ్ ఎఫెక్ట్‌తో పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కంపౌండింగ్ అంటే వడ్డీపై వడ్డీ లభిస్తుంది. ఈ లాంగ్-టర్మ్ సేవింగ్స్ అకౌంట్‌ను కావలసినంత కాలం ఉంచుకోవచ్చు. టెన్యూర్ ముగిసిన తర్వాత మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఇలా చేసినప్పుడు అకౌంట్‌లో ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించడం మంచిది. పీపీఎఫ్ ఖాతాలో రూ.కోటి కంటే ఎక్కువ కార్పస్ క్రియేట్ చేయవచ్చు. అంత మొత్తం డబ్బుతో హ్యాపీగా రిటైర్ కావచ్చు.
25 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు..
పీపీఎఫ్ అకౌంట్‌ను బ్రేక్ లేకుండా 15 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. ఆ తర్వాత మరో 5 ఏళ్లు రెండు సార్లు పొడిగించుకోవచ్చు. అలా మొత్తంగా 25 ఏళ్లు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. పాతికేళ్లు పెట్టుబడి పెడితే సులభంగా కోటీశ్వరులు కావచ్చు. ఒకరు ఇందులో ఏడాదికి రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. 25 సంవత్సరాలకు PPF ఖాతా నుంచి రూ.1,03,08,015 లేదా దాదాపు రూ.1.03 కోట్లు పొందుతారు. ఎందుకంటే డబ్బుపై ఏటా 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. పాతికేళ్లలో రూ.37,50,000 ఇన్వెస్ట్ చేస్తే వడ్డీగా రూ.65,58,015 పొందొచ్చు. ఈ వడ్డీ మొత్తం పెట్టుబడి పెట్టిన దానికంటే దాదాపు రెట్టింపు అమౌంట్ అని చెప్పవచ్చు.
పన్ను ఆదా చేసుకునేందుకు పీపీఎఫ్ లో పెట్టుబడి ఉత్తమ మార్గం. ఈ అకౌంట్‌లో ఏటా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు, సెక్షన్ 80C కింద ఆ అమౌంట్ పై పన్ను చెల్లించకుండా ఉండొచ్చు. అలాగే, 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత పీపీఎఫ్ నుంచి డబ్బును తిరిగి పొందినప్పుడు దానిపై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- Read Latest Business News and Telugu News