News

ponguleti srinivas reddy, పొంగులేటి అనుచరులపై బీఆర్ఎస్ చర్యలు.. 20 మందిపై సస్పెన్షన్ వేటు – brs party suspended 20 followers of ponguleti srinivas reddy in vyara constituency


మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఖమ్మం జిల్లాలో మంచి కేడర్ ఉన్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొన్ని నెలలుగా బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తన అనుచరులను కలుస్తున్నారు. నాలుగేళ్లుగా తమకు అన్యాయం జరిగిందంటూ.. వాపోతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను ఆయన కలుస్తున్నారు. కాగా.. ఆయన పార్టీ మారనున్నారనే వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా .. ఆయన వైఎస్ విజయమ్మతో కూడా భేటీ అయ్యారు. ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరటమే తారువాయి అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

ఈ క్రమంలోనే.. వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు, పొంగులేటి అనుచరులు ఆయనను కలవడానికి వెళ్లారు. ఇప్పటికే పొంగులేటిపై గుర్రుగా ఉన్న అధిష్ఠానం.. ఈ విషయం తెలియటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. పొంగులేటి వర్గంపై బీఆర్ఎస్ బహిష్కరణ వేటు వేసింది. వైరా నియోజకవర్గంలోని 20 మంది నాయకులపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ను పార్టీ నుంచి బహిష్కరించింది. వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్తో పాటు ఇతర 18 మంది నాయకులను పార్టీ సస్పెండ్ చేసింది.

అయితే.. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ తన అక్కస్సు వెళ్లగక్కుతున్న పొంగులేటి.. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో భేటీ అయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.

నాందేడ్ సభలో బాల్క సుమన్‌పై కేసీఆర్ ప్రశంసలు.. ఈ ఎలివేషన్ అందుకేనా..?

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button