Pm Modi,Bengaluru Airport: బెంగళూరు ఎయిర్‌పోర్టుపై మాధవన్ కీలక వ్యాఖ్యలు.. స్పందించిన ప్రధాని మోదీ – r madhavan praises bengaluru kempegowda airport infrastructure pm modi reacts
బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని కొత్త టెర్మినల్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో మాధవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులోని మౌలిక సదుపాయాలపై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు ఆ ఎయిర్‌పోర్టును చూస్తుంటే విదేశాల్లో ఉన్న భావన కలుగుతోందంటూ తన వీడియోలో వివరించారు. అది ఒక ఎయిర్‌పోర్ట్ అంటే ఎవరు నమ్మరని.. భారత్‌లో ఉన్న ఇన్ని మౌలిక సదుపాయాలు చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదని పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో వేలాడుతూ ఉన్న మొక్కలన్నీ నిజమైన మొక్కలేనని.. పైన ఇంకా చాలా నిర్మాణాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. మొత్తంగా బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్నీ అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయని.. వాటికి సంబంధించిన దృశ్యాలను కూడా ఆ వీడియోలో చూపించారు. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అత్యుత్తమమైందని మాధవన్ పేర్కొన్నారు. విమానాశ్రయంలోని మౌలిక సదుపాయాలు వరల్డ్‌లోనే బెస్ట్‌గా ఉండటం చాలా గర్వంగా ఉందనే క్యాప్షన్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు మాధవన్ జత చేశారు.
ఇక బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్లులో ఉన్న మౌలిక సదుపాయాలు, సౌకర్యాలపై మాధవన్ చేసిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారతదేశ అభివృద్ధికి నెక్స్ట్ జెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటూ మోదీ సమాధానం ఇచ్చారు. దీంతో మాధవన్ పెట్టిన ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్.. దానికి ప్రధాని మోదీ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య సంభాషణపై నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. విదేశాల్లోని ఎయిర్‌పోర్టుల కంటే ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్ చాలా మెరుగ్గా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Read More Latest National News And Telugu News