News

piyush chawla, GT vs MI: అరుదైన రికార్డ్ ముంగిట పీయూస్ చావ్లా.. జస్ట్ 3 వికెట్లు – spinner piyush chawla needs 3 wickets against gt to join chahal, ashwin in elite list


ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో ముంబయి ఇండియన్స్ (MI) సీనియర్ స్పిన్నర్ పీయూస్ చావ్లా (Piyush Chawla) తన అద్వితీయ ప్రదర్శనతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 34 ఏళ్ల చావ్లా తాజా సీజన్‌లో ఇప్పటికే 15 మ్యాచ్‌లాడి 21 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ 2023 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ లెగ్ స్పిన్నర్.. మరో మూడు వికెట్లు తీస్తే అరుదైన రికార్డ్‌లో చోటు దక్కించుకోనున్నాడు.

ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు రాత్రి అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈరోజు క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో అహ్మదాబాద్ వేదికగానే ఫైనల్లో తలపడనుంది. వాస్తవానికి ముంబయి ఇండియన్స్ ఈ సీజన్ ఆరంభంలో కనీసం ప్లేఆఫ్స్‌కి చేరుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. ఆ జట్టు అంతలా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. కానీ.. లీగ్ దశ సెకండ్ హాఫ్‌లో వరుస విజయాలు సాధించిన ముంబయి టీమ్ అనూహ్యంగా ప్లేఆఫ్స్ బెర్తుని దక్కించుకుంది. అంతేకాదు గత బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తు చేసి ఫైనల్‌పై కన్నేసింది.

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబయి టీమ్ ఇక్కడి వరకు చేరుకోవడంలో పీయూస్ చావ్లా కీలకపాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఓవరాల్‌గా 256 టీ20 మ్యాచ్‌లాడిన చావ్లా 297 వికెట్లు పడగొట్టాడు. దాంతో మరో 3 వికెట్లు అతను ఈరోజు మ్యాచ్‌లో తీస్తే..? టీ20ల్లో 300 వికెట్లు పడగొట్టిన మూడో భారత స్పిన్నర్‌గా అతను రికార్డుల్లో నిలవనున్నాడు. ఇప్పటి వరకు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

Related Articles

Back to top button