News

Pet Dog,రూ.12 లక్షలు పెట్టి కుక్కలాగా మారిన వ్యక్తి.. సినిమాల్లో నటించేందుకు ఆడ కుక్క కావాలట! – man who spent rs 12 lakh to turn into a dog now wants to meet a girl dog act in films


కొందరికి పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందులో కుక్క అంటే చాలా మంది ప్రాణంగా ప్రేమిస్తారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తనకు కుక్కలపై ఉన్న ఇష్టంతో ఏకంగా కుక్క లాగా మారిపోయాడు. దానికి రూ.12 లక్షలు కూడా ఖర్చు చేశాడు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు తనకు ఓ ఆడ కుక్క కావాలని అంటున్నాడు. వారిద్దరూ కలిసి సినిమాల్లో నటించాలని కూడా తనలో ఉన్న కోరికను బయట పెట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనిని శభాష్ అంటుండగా.. మరికొందరు మాత్రం ఇదేం పిచ్చిరా బాబు అనుకుంటున్నారు.

జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఇలా కుక్కలాగా మారిపోయాడు. తనకు కుక్కలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని.. అందుకే పెద్దయ్యాకు ఇలా కుక్కలాగా మారినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు అతనికి తన లాంటి మరో ఆడ కుక్క కావాలని అడుగుతున్నాడు. అలాంటి కుక్క దొరికితే ఇద్దరం కలిసి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు వివరించాడు. తనకు ఇష్టమైన వేషంలో సినిమాల్లో యాక్టింగ్ చేయాలని భావిస్తున్నట్లు తాజాగా తన కోరికను వెల్లడించాడు. ఇప్పటివరకు టోకో కుక్కలాగా మారడం పట్ల షాక్ అవుతున్న జనాలు.. ఇప్పుడు ఆయన కోరుతున్న కోరికలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

అయితే మనిషి నుంచి ఇలా కుక్కలాగా మారడానికి టోకో ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు పెట్టాడు. టోకో కోసం 40 రోజుల పాటు కష్టపడి.. నిపుణులు ఆయనకు సరిపోయే కుక్కలాంటి డ్రెస్‌ను తయారు చేసి ఇచ్చారు. ఇక అంత ఖర్చు చేసి కుక్క కాస్ట్యూమ్ తయారు చేయించుకున్న టోకో.. అది వేసుకుని రోడ్లపైకి వెళ్లేవాడు. సాధారణ కుక్కలు ఎలాంటి చేష్టలు చేస్తాయో అలాగే ప్రవర్తించడం ప్రారంభించాడు. భూమిపై దొర్లుతూ.. తోకను ఊపుకుంటూ రోడ్లపై ఉండే కుక్కలతో కలియతిరిగాడు. అయితే మొదట్లో తన వద్దకు సాధారణ కుక్కలు వచ్చి తనను గుర్తించి.. దూరం వెళ్లేవని ఆ తర్వాత కొన్ని రోజులకు తనతో కలిసిపోయినట్లు చెప్పాడు.

అయితే తాను ఎప్పుడూ అలా కుక్క గెటప్‌లో ఉండనని.. చాలాసార్లు కేవలం ఇంట్లోనే ఈ కుక్క కాస్ట్యూమ్‌ను వేసుకుంటానని వెల్లడించాడు. అయితే టోకోకు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉండగా.. తనకు సంబంధించిన వీడియోలు అన్ని అందులో పోస్ట్ చేస్తుంటాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే టోకో చేసిన ఈ పనికి సంబంధించి సోషల్ మీడియాలో పాజిటివ్‌గా, నెగిటివ్‌గా కామెంట్లు వస్తూనే ఉన్నాయి.

ChatGPT: అద్భుతం.. 3 ఏళ్లుగా 17 మంది డాక్టర్లు చేయలేనిది.. చాట్‌జీపీటీ చేసి చూపింది!
వన్ చిప్ ఛాలెంజ్‌లో పాల్గొన్న బాలుడు మృతి.. స్టాక్‌ను వెనక్కి తెప్పించుకున్న కంపెనీ
Read More Latest International News And Telugu News

Related Articles

Back to top button