News

pawan kalyan, ఆ దేవుడికే ఎరుక.. డ్రామా నడిపి రూ. 660 కోట్లు అస్మదీయుడికి జగన్ అప్పజెప్పారు: పవన్ కళ్యాణ్ – pawan kalyan targets ap cm ys jagan on annamayya dam issue


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ టార్గెట్‌గా మరోసారి ట్వీట్‌లు చేశారు. పాపం పసివాడు అంటూ సీఎం జగన్‌పై సెటైర్లు పేల్చిన జనసేనాని.. తాజాగా అన్నమయ్య డ్యామ్ ఘటనపై మరో ట్వీట్ చేశారు. జగన్ సర్కార్ తీరు వల్ల దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు పవన్. హామీలు ఇచ్చి సాధించింది ఏమీ లేదన్నారు.

‘రూ.500 కోట్ల ఆస్తులుతో ముఖ్యమంత్రుల్లోనే ధనికుడైన ఏపీ సీఎం ఈ మధ్య కార్ల్‌మార్క్స్‌లా తరచూ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ తమాషా ఏంటంటే.. అణచివేతదారుడు అణచివేతకు గురైనట్లు మాట్లాడటం. ఏదైనా సందేహం ఉంటే.. దయచేసి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల గ్రూప్స్‌ను సంప్రదించొచ్చు. 19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు, గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు’ అంటూ అప్పట్లో జరిగిన ఘటనను గుర్తు చేశారు.
‘ప్రమాద ఘటన జరిగిన వెంటనే AP CM అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో , AP CM ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక’ అంటూ ఎద్దేవా చేశారు.

‘అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటి కి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ. 660 కోట్లకు అప్పచెప్పారు’ అని ఆరోపించారు.

‘కేంద్ర జలవనురుల శాఖ మంత్రి షెకావత్ గారు రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారు’ అంటూ ట్వీట్ చేశారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button